త్యాగరాజు రామదర్శనం 18 వభాగం: -మూలం...డా.ములుకుట్ల బ్రహ్మానందశాస్త్రి:-సేకరణ...అచ్యుతునిరాజ్యశ్రీ
 

ఇక జనాలంతా తండోపతండాలుగా వచ్చారు.త్యాగయ్య శిష్యులు ఉమయాల్పురం కృష్ణ భాగవతార్,తిల్లస్థానం రామయ్యంగార్,అయ్యా భాగవతార్,వాలాజపేట కృష్ణ స్వామిభాగవతార్,కంచివేంకటాద్రిస్వామి,తాలూకా తహసిల్దార్ శ్యామలరావు అంతా చేరారు.పుష్యబహుళపంచమి ఉదయంనాడు  వాగధీశ్వరిరాగంలో త్యాగయ్య "పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగ తెల్సుకోరే హరియట  హరుడట సురలట, నరులట 
అఖిలాండ కోటులటయందరిలో" ,మనోహరిరాగంలో " పరితాపము గనియాడిన పలుకుల మరచితివో, " పాడుతున్నారు. మధ్యాహ్నం 11గంటలటైంకి ధన్యాసిరాగంలో" శ్యామ సుందరాంగ సకలశక్తియు నీవెరా...దుష్ట దనుజ మదవిదార శిష్టజన హృదయ విహార" అని పాడుతున్న త్యాగయ్య కి కపాలం విచ్ఛిన్నమైంది. కపాలంనుంచి జ్యోతి వెల్వడి రామునివిగ్రహంలో కల్సిపోవటం,త్యాగయ్య సిద్ధిపొందటం జరిగింది.త్యాగయ్య గురువైన శొంఠి వేంకటరమణభాగవతుల సమాధిప్రక్కనే త్యాగయ్య గారి శరీరాన్ని మేళతాళాలతో  ఊరేగింపుగా తీసుకెళ్లి సమాధిచేశారు.ఆయన సమాధిపై బృందావనం తులసికోటను కట్టారు.శొంఠివారికి  త్యాగయ్య కలలో కన్పడి" ఈరోజునుండి నా ఆత్మ  ఏకాదశివరకు శ్రీరంగం తిరుమల మొదలైన పుణ్యక్షేత్రాల్ని  దర్శించిపుష్యబహుళ ఏకాదశినాడు పూర్ణసిద్ధిపొందుతుందని, 60ఏళ్ల దాకా తనకు ఎలాంటి ఉత్సవాలు చేయొద్దని " చెప్పారు.ఇప్పుడు కూడా వాలాజాపేటలో పుష్యబహుళ ఏకాదశినాడు,తిరువయ్యూరులో పుష్యబహుళపంచమినాడు త్యాగయ్య ఆరాధనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి🌷
కామెంట్‌లు