త్యాగరాజు రామదర్శనం 19వభాగం: మూలం...డా.ములుకుట్ల బ్రహ్మానంద శాస్త్రి:- సేకరణ...అచ్యుతునిరాజ్యశ్రీ


 త్యాగయ్య సిద్ధిపొందింది 1847లో!  1907 వరకు  ఆయన ఆదేశంపై తిరువయ్యూర్ లో ఆయన సమాధిదగ్గర ఏ ఉత్సవాలు జరగలేదు.1907 నుంచి దేశంలోని సంగీతవిద్వాంసులంతా ఆరాధనోత్సవాలలో పాల్గొంటున్నారు.ఈయన సమాధి ఎదురుగా బెంగుళూర్ నాగరత్నమ్మ గారి సమాధి ఉంది.ఆమె తన యావదాస్తిని సమర్పించింది."శ్రీత్యాగరాజస్వామివారిసమాధి పూజ"అనే శీర్షికతో ఓవ్యాసం ఆమె రాశారు.అదిత్యాగయ్య శతవార్షిక సంచికలో ఉంది.బెంగుళూరు నాగరత్నం ట్రస్ట్ కి డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణ ట్రస్టీగా ఉన్నారు.త్యాగయ్య గారి దేవాలయ నిర్మాణానికి పూనుకొన్నవారు శ్రీ.ఎస్.పి.రామస్వామిఅయ్యంగార్.1925లో దేవాలయ నిర్మాణం ప్రారంభమైనదిఅప్పుడొక విచిత్ర సంఘటన జరిగింది.త్రవ్వకం చేస్తున్నప్పుడు బెంజాయిన్ వాసన రావటంతో ,అక్కడనుంచి కట్టడం ఆరంభమైనది.ఒకరోజు  శూలమంగళం వైద్యనాధభాగవతార్ కావేరీ ఒడ్డున సంధ్యావందనం చేస్తున్నప్పుడు సమాధిలోపలనుంచి రామరామ అనే శబ్దం విన్పడటంతో ఆశ్చర్యపోయాడు.ఇక శ్యామశాస్త్రి  త్యాగయ్య  మంచి స్నేహితులు. ఒకరి పాటను పాండిత్యాన్ని ఇంకోరు మెచ్చుకుని ఆనందించేవారు. త్యాగయ్య  ముత్తుస్వామి దీక్షితులు కలుసుకొన్న దాఖలాలు లేవు మరి! కానీ టి.ఎల్. వెంకట్రామయ్యర్ రాసిన ముత్తుస్వామిదీక్షితులు అనే ఆంగ్ల పుస్తకంలో త్యాగయ్య దీక్షితులు తిరువయ్యూర్ లో కల్సుకున్నట్లు రాశారు🌷
కామెంట్‌లు