సీతారామలక్ష్మణులు దండకారణ్యములోని మునుల ఆశ్రమమున ప్రవేశించుట.
సామాన్యులు అడిగిడుటకు అసాధ్యమైన
దండకారణ్యమునందు ప్రవేశించెను
అచట అనేక మునుల ఆశ్రమములు కనుబడెను
వారికచట దర్భలు, నార చీరలు కనబడుచుండెను
మునులు వేదపఠణములు గావించుచుండిరి
ఆ ఆశ్రమములు సురక్షితమైన నివాసభూమి
ఆ ప్రాంగణములన్నియు స్వచ్ఛముగా నుండెను
అచట మృగములు పక్షులు హాయిగా జీవించుచుండెను
పవిత్రమైన ఆ ప్రదేశమున అప్సరసలు దైవసేవలో
ప్రతి దినము నృత్యము లోనర్చుచుండిరి
అచ్చట యజ్ఞశాలలు అతి విశాలముగా ఉన్నాయి.
ఆ ఆశ్రమసమూహము భూతలములచేతను
వైశ్వదేవాది హోమములతో పునీతమైనది.
వేదఘౌషలతో ప్రతిధ్వనించుచుండెను.
కమలశోభలతో కలకలలాడుచుండెను
సరస్సులతోడను, వనపుష్పములతోడను
చూడముచ్చట గొలుపుచుండెను.
అచట మునులు నార చీరలు, ధరించియున్నారు
కందమూలఫలములే వారికి ఆహారము.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి