2 సర్గ ( 2 ): - ఎడ్ల లక్ష్మి , సిద్ధిపేట


మీ ఆయువుమూడి ఈ అరణ్యమునకు వచ్చినారు 
మీరు తాపసులగా యుండియు
ఒక స్త్రీతో నివసించు చున్నారు ఎలా? 
మీ అధర్మ ప్రవర్తన మునుల పద్ధతికి విరుద్ధము గదా? 

మీరెవరు? నేను విరాధుడను రాక్షసుడను, 
నిత్యము మునుల మాంసమును భక్షించుచు 
ఈ అరణ్యములో సంచరించుచుందును 
మిమ్ములను చంపి మీ రక్తమును త్రాగెదను. 

"నాయనా! లక్ష్మణా! నా భార్య సీతాదేవి 
సుఖసంపదలలో పుట్టి పెరిగినది. 
అయ్యో! ఆమె విరాధుని చేతికి చిక్కియున్నది సుమా! 
లక్ష్మణా మన కష్టాలే కైకేయికి ఇష్టమేమ!. 

ఓ సౌమిత్రీ! వైదేహి పరుని స్పర్శకు లోనగుట
నాకు మిక్కిలి బాధాకరంగా యున్నది అంటూ 
శ్రీరాముడు పెను శోకములో మునిగెను

అన్నయ్యా! దేవేంద్రుని వలె శక్తివంతుడవు 
సమస్త ప్రాణులకు నాథుడవు దుఃఖించ తగదు 
శ్రీరామా! నేను ధనస్సును సంధించి విడిచిన క్షణంలో 
ఆ దుష్టుని శరీరము నుండి ప్రాణాలు ఎగిరిపోవును. 

========================================

అరణ్యకాండమందు 2 సర్గ సమాప్తము 🙏🏻
కామెంట్‌లు