ఇప్పుడు త్యాగయ్యను సందర్శించిన మహనీయులను గూర్చి తెలుసుకుందాం.తూము నరసింహదాసు 6వేలనియోగి,సంస్కృతాంధ్రభాషల్లో భక్తి కీర్తనలు రాసితరించిన మహానుభావుడు.అపర రామదాసుగా పేరుగాంచిన ఈయన 1790లో గుంటూరు లో పుట్టాడు.మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహంతో పుట్టాడు.భార్య లక్ష్మీబాయమ్మ. పొన్నూరు తాలూకాఫీసులో చిన్న ఉద్యోగం చేస్తూ"రామసహాయమెన్నటికో భక్త కాముని " అని తపించే ఆయనకురాముడు కలలో కన్పడి భద్రాద్రికి రమ్మనగానే ఉద్యోగానికి రాజీనామా చేసి"రామనామమే జీవనము,భక్తావనము పతితపావనము" అని వెళ్లి " అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి" అని పరవశించాడు."నాపాలి భాగ్య మేమందు, రఘునాధుడు కనిపించే ముందు"," రామా నీవాడ సుమీ,ఇక నన్ను బాములబెట్టకుమీ" అని పాడుతూ తిరువయ్యూర్ చేరారు త్యాగయ్యను చూడాలని."రామా నీదయ రాదా?" అని పాడుతున్న త్యాగయ్య, ఆజానుబాహుడు తంబుర చిరతలతో ఉన్న నరసింహదాసుని చూసి"రామభక్తి సామ్రాజ్యమేమానవుల కబ్బెనో మనసా! ఆ మానవుల సందర్శనమత్యంత బ్రహ్మానందమే" అని స్వాగతం పలికారు.అప్పుడు తూమువారు"రామా!నీదయరాదా? పూర్ణకామా! నీమదిలేదా?" అని పాడి కొన్నాళ్లక్కడ ఉన్నారు.తీర్థయాత్రలు చేస్తూ నాదెళ్ల వరదరామదాసను ధనికుని సన్మానం పొంది భద్రాద్రి చేరాడు.కలలో రాముడు కన్పడి"నైజాం ప్రధాని చందూలాల్ మాధవలాల్ సేట్ ని కలు" అనటంతో తూము కలవటం" భద్రాద్రి పాల్వంచ పరగణాలు పాలించు" అని రాజా బిరుదునిచ్చాడు.అలా భద్రాద్రి ఆలయ బాధ్యతలు స్వీకరించిన దాసుగారి కీర్తనలను దేవస్థానంవారు ప్రచురించారు.విజయవాడ ఆకాశవాణి 1957లో భక్తిరంజని లో తూమువారి కీర్తనలు ప్రసారం చేస్తూ వచ్చారు.శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రిగారు తూమువారిగా నటించి దర్శకత్వం వహించిన సంగీత రూపకం ,ఆయన హరికథ జనాలమెప్పు పొందాయి.తెనాలి సీతారామగానసభ వ్యవస్థాపకులు నూరుమంది సుబ్బారావుగారు తూము నరసింహ దాసు ఉత్సవాలు జరపటం చరిత్ర మరుగున పడిన సత్యం🌷
త్యాగరాజు రామదర్శనం20వభాగం: -మూలం..డా.ములుకుట్ల బ్రహ్మానందశాస్త్రి:- సేకరణ...అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి