త్యాగరాజు రామదర్శనం 21వభాగం: -మూలం..డా.ములుకుట్ల బ్రహ్మానందశాస్త్రి:-సేకరణ...అచ్యుతునిరాజ్యశ్రీ


 కాశీనివాసి గోపీనాధభట్టరాచార్యులు హిందుస్థానీ సంగీత పాండిత్యంకలవాడు.కలలో రాముడు కన్పించిత్యాగయ్యను కలవమని ఆదేశించాడు.రామేశ్వరయాత్రకు బైలుదేరిన ఆయన తిరువయ్యూర్ వెళ్లడం,ఆయన కోరిక ప్రకారం,త్యాగయ్య  తోడి రాగంలో" దాశరథే నీఋణము దీర్ప నా తరమా  పరమపావన నామా...భుక్తి ముక్తి కలుగు కీర్తనముల బోధించిన త్యాగరాజ కరార్చిత" అనిపాడారు.శ్రీరాముడు గోపీనాధుడు ఉత్తర భారతంవారని ఆప్రాంతానికి చెందిన తోడి రాగంలో త్యాగయ్య పాడటం సముచితంఅని పలువురి అభిప్రాయం.శహన రాగంలో" ఈవసుధ నీవంటి దైవ మెందుగాన" అని పాడారు.గోపీనాధులవారు కొన్నాళ్లు త్యాగయ్య ఇంట అతిథిగా ఉండి రామేశ్వరం వెళ్లారు🌷
కామెంట్‌లు