2 రెండవ సర్గ : - ఎడ్ల లక్ష్మి, సిద్ధిపేట
సీతారామ లక్ష్మణులకు దారిలో విరాధుడను రాక్షసుడు తారసపడుట 




మునులు,సిద్ధులు భక్తి పూర్వకముగా ఇచ్చిన 
అతిథి సత్కారములను స్వీకరించి 
సీతారామ లక్ష్మణులు ఆ రాత్రి అచట గడిపి 
ఉదయము స్నానాధికములను ముగించుకున్నారు. 

శ్రీరాముడు మునీశ్వరులకు అంజలి ఘటించి
సీతా లక్ష్మణులతో గూడి వనములోకి వెళ్ళెను 
వివిధమగు మృగములతో 
నిండియుండెను 
వృక్షములన్నియు ధ్వంసమై యుండెను 

వారు భయంకరమైన ప్రదేశమును జూచిరి. 
ఆ భయంకరమైన అడవిలో వారు మృగములతో పాటు 
పర్వతాకారుడను రాక్షసుని జూచిరి
అతడు వికృత రూపంలో భయంకరముగా ఉండెను
అతడు పులితోలు కప్పుకొని యుండెను.

ఆ రాక్షసుడు సీతారామలక్ష్మణులపై 
మృత్యుదేతవలె వారిపై దూసుకు వచ్చెను 
అతడు భీకర నాదములు చేయుచు 
సీతాదేవిని కొంత దూరము తీసుకెళ్లి ఇట్లంటాడు

ఓ పాపాత్ములారా! మీరు మునుల వలె 
జటావల్కములను దాల్చియు 
ధనుర్భాణములను ధరించియున్నారు 
ఒక స్త్రీని వెంటనిడ కొనియున్నారు.

కామెంట్‌లు