అది ఏరూపంలో వస్తుందో కానీ అమ్మాయిని
పదహారవ యేడు వరకు కంటికి రెప్పలా
కాపాడాలి మహారాజా అని విన్నవించు కున్నాడు సుసేనుడు. ఆ పలుకులతో
రాజ దంపతులు కలవర పడ్డారు. పండితోత్తమా
ఈసమస్యకు పరిష్కారం సూచించండి!!
యజ్ఞాలు చేయమంటారా! యాగాలు నిర్వ
ర్తించమంటారా! ఏవిధమైన పూజలు వ్రతాలు
శాంతులు ఏమి చేయమంటారు సెలవీయండి
అని అన్నాడు శివ దత్తుడు.
మహారాజా ఈ
సుకుమారి ఆ కాత్యాయనీ అమ్మవారి అను
గ్రహ ఫలం. మీరు ఆ అమ్మవారినే శరణు
వేడండి. ఆమే సర్వం చూసుకుంటుంది. ఇక
మన యువరాణీ గారికి "అమృత వల్లి" అని
నామకరణం చేస్తున్నాను..ఈమె మంచి విద్యా
వంతురాలౌతుంది. సుగుణరాసి. ఈమె
యుక్త వయస్కురాలైన తరువాత ఈమెను
వివాహ మాడటానికి రాజులంతా పోటీ
పడతారు. అంత సౌంధర్యరాసి మన
యువరాణీ వారు. మంచి యోగ్యుడైన
అల్లుడు మీకు లభిస్తాడు. అతను మీ తరువాత చక్కని పరిపాలనా దక్షత గల వీరుడు అవుతాడు.
అని విన్నవించు కున్నాడు ఆస్తాన పండితుడు
సుసేనుడు.
సంతసించిన మహారాజు ఆయనను ఘనంగా సత్కరించి బూరి దక్షిణలతో సంతృప్తిని గావించి సాగనంపాడు మహా రాజు శివదత్తుడు.
అమృతవల్లి ముద్దుమోముతో చిరు నవ్వులు
చిందిస్తూ ఆట పాటలతో అలరిస్తూ నట్టింట్లో
నడయాడే ఆ పసిపాప ముద్దు ముచ్చట్లకు
మురిసి పోతూ అపురూపంగా చూడసాగారు.
ఆమెకు సంగీతం నాట్యం విద్య వినయం
ఒకటేమిటి సకల కళా కోవిదురాలై యక్త
వయసు లోకి అడుగు పెట్టింది అమృతవల్లి.
ఆమె దేవకన్యను తలపించే సౌందర్యంతో
అలరారుతోంది. ఈమె సౌంధర్య గుణగణాలను ఆనోటా ఈనోటా విన్న పొరుగు దేశ
యువరాజులు ఆమెను వివాహం చేసుకోవాలనే కుతూహలంతో వున్నారని వేగుల
ద్వారా విన్న మహారాజు మంత్రి సుభుద్దిని
రప్పించాడు.
ముఖ్యమైన రాజోద్యోగులను
ఆస్తాన పండితుడు సుసేనుణ్ణి పిలిపించాడు.
మన యువరాణీ వారు యుక్తవయసులోకి
అడుగిడినారు. ఆమెకు వివాహం చేసే
సమయమాసన్నమైనది. కావున వివిద
దేశ యువరాజులకు వర్తమానమందించి
అమ్మాయికి స్వయం వరం ప్రకటిద్దామని
అనుకుంటున్నాను. అందుకే మీఅందరినీ
సమావేశ పరిచాను. మీ మీ నిర్ణయాలను
సెలవీయండి అని అన్నాడు శివదత్తుడు.
మహారాజా మంచి ఆలోచన చేసారు. అలాగే
స్వయంవరం ప్రకటించండి.మాకు మీ
నిర్ణయం సముచితముగా యున్నదని
అందరూ ఏకగ్రీవంగా అంగీకరిచారు. ఒక్క
సుసేనుడు మాత్రం అంగీకరించలేదు.
మహారాజా మన్నించాలి!! యువరాణీ వారికి
వివాహం చేయటం స్వయంవరం ప్రకటిం
చటం నాకూ సమ్మెతమే కానీ ?
తరువాత బాగం రేపే(సశేషం).......
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి