సీతారామ లక్ష్మణులు సుతీక్ష్ణుని అనుమతితో మునీశ్వరులతో
దండకారణ్యమునకు బయలుదేరుట
ప్రభాతవేల మేల్కొని వారు స్నానాలు ఆచరించిరి
లక్ష్మణుడు ముందే స్నానమొనర్చి
వారి సేవలకు సిద్ధముగా నుండెను.
సుతీక్ష్ణుని తపోవనమున హోమ కార్యములను
దేవతా పూజలను ముగించుకొని
ఆ ముని ఆజ్ఞనొసంగి మునులతో గూడి
దండకారణ్యమునకు బయలుదేరినారు.
సుతీక్ష్ణమహర్షి శ్రీరామునితో ఇట్లు పలికెను
నాయనా! రామా! సీతా లక్ష్మణులతో గూడి నీవు
ఎట్టి ఉపద్రవములునులేని దారిలో సాగిపొమ్ము!
రామా! ప్రయాణము నెమ్మదిగా కొనసాగింపుము
నాయనాలారా! ఆశ్రమమునకు మరల విచ్చేయుడు
మహర్షికి ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించి
ప్రయాణమునకు సన్నద్ధుడాయెను
సీతాదేవి చక్కని అమ్ముల పొదలను, ధనస్సులను
ఖడ్గములను రామలక్ష్మణులకు తెచ్చి ఇచ్చెను
ఇద్దరు సోదరులు ధనస్సులను ధరించి
సీతాసహితులై ముందునకు నడవసాగిరి.
==================================
అరణ్యకాండమందు 8 వ సర్గ సమాప్తము.🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి