9 వ సర్గ ( 2 ): - ఎడ్ల లక్ష్మి

 

ఓ వీరా! నీవు ఇలా! దండకారణ్యంలో 
ప్రయాణము చేయుట నాకు తృప్తిగా లేదు 
నేనందుకు కారణములను తెలుపెదను 
నేను జెప్పే మాటలు వినుము ఓ శ్రీరామా !

నీవు ధనుర్భాణములను చేతబట్టి
లక్ష్మణసహితుడవై వనములో కెళ్ళినాక
వనములో సంచరించేటి 
రాక్షసులపై, మృగములపై
బాణములను ప్రయోగింతువు గదా!

ఓ మహా బహూ! పూర్వకాలము 
మృగములు, పక్షులు హాయిగా తిరుగుతూ 
ప్రశాంతముగా జీవించుచుండేవి 
ఆ ప్రశాంత వనమున ఒక తపస్వి ఉండేవాడు

అతడు నిర్మలమైన మనసు గలవాడు 
శచీపతియైన ఇంద్రుడు ఆ ముని తపస్సును 
బంగపరచుటకు ఒక ఖడ్గము తీసుకుని 
భటుని రూపములో ఆశ్రమమునకు వెళ్లెను

వాడియైన తన చేతిలోని ఖడ్గమును 
ఆ తాపసికాడ న్యాసముగా ఉంచెను 
ఆ తాపసి ఆ రోజు నుండి ఆ ఖడ్గము రక్షించుటకై 
నిమగ్నుడైయుండి తపస్సునందు ఏకాగ్రతను కోల్పోయెను.
 

కామెంట్‌లు