9 వ సర్గ : (3 ): - ఎడ్ల లక్ష్మి


తపస్సునందు ఏకాగ్రత కోల్పోవుటవలన 
అతని బుద్ధి హింసాత్మకముగా మారెను 
ఆ ఖడ్గము యొక్క సంస్కారము వలన 
ఆ ముని అధర్మమార్గమునకు లోనయ్యెను

అతడు హింసాత్మక చర్యలకు దిగెను
అందువల్ల నరకము ప్రాప్తించెను 
హింస ప్రవృత్తికి కలిగించేటి విధానము 
శాస్త్ర సంస్కరణ జరిగిన సంగతి ఇది

ఓ ఆర్యా! శస్త్రధారణముల వలన
బుద్ధి కలిషితమగును ప్రభూ! కనుక
వనవాస దీక్ష ముగిసిన పిమ్మట 
అయోధ్యలో క్షత్రియ ధర్మమును పాటించుడు

ధర్మాచరణమువలన మేలు జరుగును
ఈ వనమున తపోదీక్షులమై ఉండవలెను 
తపోదీక్షను పాటించిన 
ముక్తి మార్గము లభించును 
ఈ జగత్తునకు ధర్మమే ఆధారము .

ఓ సౌమ్యుడా! నిర్మలమైన బుద్ధితో 
నిత్యము తపోవన ధర్మమునే ఆచరింపుము 
సోదరుడగు లక్ష్మణునితో ఆలోచించుము అని
సీతాదేవి శ్రీరామునికి భక్తితో తెలిపెను.

అరణ్యకాండమందు 9 వ సర్గ సమాప్తం.🙏🏻
కామెంట్‌లు