నా పంచపదుల సంఖ్య----- 2297-2299.2297.జంతూనాం నరజన్మ దుర్లభం,మరణం తెచ్చుకోకు!అది సహజం ,నీవు,ప్రయత్నించకు, తొందరపడకు!ఆయువు దైవమిచ్చిన ,వరం, సాగని, కడవరకు!హత్యే కూడనిది, ఆత్మహత్య ,ఆలోచనే రానీయకు!బతుకు విలువ కట్టేయకు,చావుతో ముడి పెట్టకు,పివిఎల్!2298.జీవితం ద్వంద్వం ,కృష్ణ,శుక్ల పక్షం ,కాలమే భ్రమణము!హృదయ దౌర్బల్యం తగనిది,విషాదాన్ని గెలువుము!పురుషుడా! రాముడై ,వచ్చిన,కష్టాన్ని ఎదిరించుము!మహిళా! సీతవై ,శోకాన,ఆత్మహత్య విరమించుము!చావు పరిష్కారమా?చేతకానితనం, అంగీకారము!నడక జీవనం ,ఆగిపోవడం,మరణ స్వయంవరం, పివిఎల్!2299.అగాధం జలనిధి వెతికితే,ముత్యం దొరుకుతుంది!శోకం మరుగు దాటితే ,సుఖం తప్పక ఎదురొస్తుంది!అంధకారం చుట్టూ ఉన్నా,సుప్రభాతం వచ్చి తీరుతుంది!పట్టిన గ్రహణం విడుతుంది,గ్రహమే ప్రకాశిస్తుంది!బతుకు భయం వీడితే,జీవితాన విజయం నిశ్చయం, పివిఎల్!________

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి