ఆధునిక ఉపాధ్యాయుడు చాక్పీస్ నుండి డిజిటల్ బోర్డులోకి దూరి పోయినాడు. వివిధ యాప్ల మధ్య గంతులు వేస్తున్నాడు. టెక్స్ట్ బుక్ నుండి e బుక్స్ వరకు వచ్చాడు. ప్రయోగశాలలో రసాయనాల మధ్య నిత్య నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. స్మార్ట్ క్లాస్ రూమ్ లు ప్రొజెక్టర్లు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టం (LMS) ఇంటర్ ఆక్టివ్ వీడియోలు, ప్రజెంటేషన్ సాంకేతిక పరిజ్ఞానంతో ముందు వెళ్తూ ఉన్నాడు. అభ్యసనా ప్రమాణాలను నిలబెట్టే ప్రయత్నానికి తెరలు తీస్తున్నాడు. నిజమైన ఉపాధ్యాయులు ఎవరంటే... డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి... ప్రకారం విద్యార్థులను స్వయంగా ఆలోచించేలా ప్రోత్సహించేవారు అంటారు. తల్లిదండ్రులు కేవలం జీవనాన్ని ఇస్తే ఉపాధ్యాయులు ఆ జీవనాన్ని ఎలా ఆనందంగా గడపాలో (art of living) నేర్పుతారు. విద్యార్థికి జ్ఞాన జన్మను (రెండవ జన్మను) ఇచ్చేవాడే ఉపాధ్యాయుడని.... ఉపనిషత్తులు చెబుతున్నాయి.
వేదాలు, ఉపనిషత్తులు, ఉపాధ్యాయుడిని వారి పాత్రను ఆకాశానికి ఎత్తినాయి. ఆచార్యవాన్ పురుషో వేద...
అంటే కేవలం ఉత్తమ గురువును పొందిన వ్యక్తి మాత్రమే, నిజమైన జ్ఞానాన్ని పంచగలుగుతారు, అలాగే విద్యార్థికి సరైన మార్గదర్శకత్వాన్ని చేయగలరు.
విద్యార్థి ఉపాధ్యాయుడు ఇద్దరూ కలిసి ఎదగాలని (సహనావవతు.. ప్రార్థన) తెలియజేస్తుంది. రూసో ప్రకారం... విద్యార్థిని వెనక నుండి నడిపించే వాడే దర్శకుడు (invisible guide) అని తెలిపినా, ప్రస్తుతం నిజంగా వెనుక నుండి మాత్రమే నడిపించాల్సిన పరిస్థితి ఉపాధ్యాయులది. అలాగే ఉపాధ్యాయుడు జ్ఞాన నిర్మాణానికి సహాయం చేయాల్సి ఉంటుంది spoon feeding కాదు. కానీ చేయాల్సి వస్తుంది.
ఆధునిక సర్వేలు
RAND యొక్క 2025
state of the American teacher సర్వే ప్రకారం 53% ఉపాధ్యాయులు తీవ్రమైన ఒత్తిడికి గురైనట్లుగా నివేదించారు. నేటి బోధన ఒక ప్రత్యేకమైన వాతావరణంలో సాగుతుంది. గ్రేడింగ్, ప్రవర్తన ఒత్తిడితో వ్యవహరిస్తున్నప్పటికీ, AI గురించి స్పష్టత లేకున్నా తనను తాను ఉపాధ్యాయుడు పునర్నిర్మించుకునే ప్రయత్నాన్ని చేస్తున్నాడు. విద్యార్థులకు సొంత ఆలోచనతో సృజనాత్మకతను గురించి రాయమన్నప్పుడు విద్యార్థులుAI ని ఒక సాధనంగా వాడాలి కానీ ప్రస్తుతం ఊత కర్రల వాడడం జరుగుతుంది. ఈవేళ ఉపాధ్యాయుడు కేవలం బోధనకు మాత్రమే పరిమితం కాకుండా అనేక బోధనేతర పనులు, గూగుల్ ఫార్మ్స్
ఆన్లైన్ శిక్షణలు, నివేదికలు తయారు చేయడం, డేటా ఎంట్రీ యాప్ ల నిర్వహణ ఆన్లైన్ పనులు, ఆఫ్ లైన్ తరగతులతో పాటు ఉపాధ్యాయులకు గుక్క
తిప్పుకునే సమయం కూడా దొరకట్లేదు.
ఆధునిక విద్యార్థులు
సోషల్ మీడియాలో బిజీగా ఉండి, ప్రస్తుతం విద్యార్థులు డిజిటల్ పరధ్యానంలో ఉన్నారు మన వైపు తీసుకొని రావడానికి ఉపాధ్యాయుడు తన వైపుగా ప్రయత్నం చేయాల్సిన అవసరం చాలా ఉంది. తల్లిదండ్రుల జోక్య ప్రభావం కూడా కొంత ఒత్తిడిని తట్టుకోవాలి. విద్యార్థుల స్వభావాన్ని గురించి చూస్తే... భావోద్వేగాల భాండాగారం వాళ్ళు ఇప్పుడు. చిన్న మెచ్చుకోలుకు ఆకాశానికి ఎగిరిపోతారు చిన్నమాటకు కృంగిపోతారు. పోలికలకు నలిగిపోతారు.
మనం కొన్ని ఈ మధ్యన విపరీతమైన చర్యల్ని చూశాం, సంఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉపాధ్యాయుల మీద విద్యార్థుల దాడులు అలాగే హత్యలు లాంటి అంశాలను మనం చూసాం. ఇప్పుడు ఉపాధ్యాయులు తమకు తాము గుండె నిబ్బరంతో విద్యార్థులను డీల్ చేయాల్సి వస్తుంది.
గురుతర బాధ్యత!!
ఈనాటి విద్యార్థులకు భయపెట్టే గురువు కాదు భుజం తట్టే గురువుల అవసరం. వాళ్ల మనసులోని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు చిగురించిన మల్లెలు కాదు, మొబైల్ స్క్రీన్ మీద విచ్చుకున్న కొత్త పూల పరిమళం అదే, కానీ రూపం మాత్రం కొత్తది. తదనగుణంగా ఉపాధ్యాయులు అడుగు వేయాల్సిన అవసరం ఉంది.
21వశతాబ్దపు ఉపాధ్యాయులు విషయాల పట్ల అప్డేట్ కావాల్సి వస్తుంది లేకపోతే అవుట్ డేట్ అయిపోతారు. నూతన సాంకేతితతో సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లవాడి ఒత్తిడి ఆందోళనను మనం గ్రహించి వారికి అండగా నిలబడాలి.
ఉపాధ్యాయుని హృదయం సహానుభూతిని కలిగి కృత్రిమ మేధస్సు యొక్క ప్రజ్ఞను కలుపుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.
అనుకూలత విశ్వాసాన్ని నిండుగా మెండుగా కలిగి ఉండాలి. ఇప్పుడు విద్యార్థులకు సోషల్ మీడియా నుంచి ఎప్పుడు un plug చేసుకోవాలి... అనే సూచనలు అందించి విద్యార్థుల మెదడుకు విశ్రాంతి అందేట్లు చూడాలి. డిజిటల్ పరధ్యానంలో ఉన్న విద్యార్థులనుమన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేయాలి. ప్రముఖ సైకాలజిస్ట్ carlo dweck సిద్ధాంతం ప్రకారం గ్రోత్ మైండ్ సెట్ అవసరం అది ఏంటంటే ప్రయత్నిస్తే ఏ విద్యార్థి అయినా నేర్చుకోగలడు అనే నమ్మకం.
బోధన బబోధ నేతర కార్యక్రమాలు విద్యార్థుల క్రమశిక్షణ రాహిత్యం వలన ఉపాధ్యాయులు మానసికంగా శారీరకంగా అలసిపోతారు. దీనినే సైకాలజీలో burn out
అంటారు. దీని నుండి బయటపడి బోధనా నైపుణ్యాలపై నమ్మకాన్ని teacher self efficacy పెంచుకోవాలి. బలమైన ఆత్మవిశ్వాసం కలిగి ఉంటే నే గొప్ప టీచర్ గా రాణిస్తారు. ఉపాధ్యాయిని నమ్మకమే విద్యార్థి జీవితంలో నిజమవుతుంది. ప్రతిరోజు పాఠం చెప్పినాక ఉపాధ్యాయులు తమను తాము విశ్లేషణ చేసుకొని రేపటికి సంసిద్ధం కావడం modify చేసుకోవడాన్ని సైకాలజీలో reflective teaching అంటారు. ఉపాధ్యాయుడు జవాబులు ఇవ్వడం నుండి ప్రశ్నలు అడగడంలా చేసే ఉపాధ్యాయునిగా రూపాంతరం చెందాల్సి ఉంటుంది.
===============================================================
(భారత పూర్వ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి