స్వర సింహం...!!: -డా ప్రతాప్ కౌటిళ్యా.


జీవితాంతం అడవికి రాజు అతడు 
సింహం అతడు స్వర సింహం అతడు.
సింహానికి సింహాసనంతో పనిలేదు 
అది ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం.!!

గుడిగంటలు 
గుండె లయలు 
సింహ గర్జన 
ఉరుములు మెరుపులు 
గంధర్వగానం అతడు.!!

సరస్వతీ స్వరం 
స్వర్గ ద్వారం 
స్వర్ణ జలపాతం 
వేణు గానం అతడు.!!

వింజమరలు 
హంసల నడకలు 
అలల తళుకులు
పిల్ల గాలులు 
వైరుల సవ్వడులు 
సముద్రసుడులు
నదుల  కదలికలు అతడు!!

స్వరకారుడు 
నిరాకారుడు 
నిరాడంబరుడు 
సుర కంఠుడు
పురాణ శంఖం పూరించిన 
పురోహితుడు అతడు.!!

ఉదయ సంధ్యల కిరణాలు 
పక్షుల కిలకిలలు 
కోకిల రాగాలు 
చిలకల పలుకులు 
చినుకుల కులుకులు 
తీరంలోని శబ్దం ఒక శతాబ్దం అతడు..!!

జన్మజన్మల మాట అతడు 
అజంతా ఎల్లోరాల పాట అతడు 
రామప్ప వేయి స్తంభాల గుడిలో గంట అతడు 
నేటి ఘంటసాల అతడు 
పాడిపంటల పాట అతడు 
పల్లెలో రేపల్లెలో  గాయకుడు అతడు. 
ఉపాధ్యాయుడు అతడు
అతడే వెంకట నరసింహారెడ్డి..!!
-----------------------------------------------------------------------------------
ఆత్మీయ మిత్రుడు సోదరులు వెంకట నరసింహారెడ్డి గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు.
--------------------------------------------------------------------------------------
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
కామెంట్‌లు