నేను మనీ మనిషిని
మంచిమానవత
ఏ కోశానా లేని రాతి మనిషిని
ఎదిగే వాడినెవడినైనా
పడదోస్తాను
ఐక్యతను భగ్నం చేసి
అనైతికతతో
అలజడి సృష్టిస్తాను
నేను ఏ రంగాలోయున్న
నాదేపైచేయి కావాలని
చూసుకుంటాను
కాదు కూడదు అని అడ్డుపడ్డోడిపై
చేయని నేరం మోపి
చెరసాల పాలుచేస్తాను
నేను రంగులు మార్చే ఊసరవెల్లిని మించినవాన్ని
నా సుఖసంతోషాలకోసం
ఎవరినైనా ఏమార్చుతాను
నేను అబద్ధాన్ని
అలవోకగా నిజంగా నమ్మిస్తాను
బలహీనులనైన
బకాసురులనైన
మెతకమనుషులనైనా
మేధావులనైనా
నేనెవరినైనా అవలీలగా
బురిడీ కొట్టిస్తాను
కాల మెప్పుడు నా గుప్పిట్లో ఉండేలా చూసుకుంటాను
ఈ మనుషులు నాకో లెక్క
నన్నుకంత్రియన్న
కర్కోటకుడన్న
జాన్తానై
నేను చేయాలనుకుందే చేస్తాను
నాకు నచ్చిందే చేస్తాను
నేను సంఘంలోన ఉన్నోన్నే
కానీ
నేను సంఘవిద్రోహశక్తినికాను
పసితనాన నన్ను ఈ కుటిల
వ్యవస్థ ఈనీతి మాలిన రాజకీయాలు
దొంగ దొరతనాల
అణచివేతలు అరాచకాలు
కనికరం లేని క్రూరత్వం
చుట్టూత ఉన్న సమాజమే
నన్ను దయలేని
దానవుడిగా మార్చింది
నాకు పెత్తందారీ వ్యవస్థ
పెట్టుబడిదారీ వ్యవస్థల
దోపిడిదారులే
నాకు బద్ధశత్రువులు
ఒకపూటకు ఉండి మరో పూటకునిత్యం దేవులాడే
బడుగు బలహీనులపైకాదు
నేను పైచేయి సాధించాల్సింది
నన్ను తూలనాడిన దుర్మార్గులు
నా బాల్యం దోచిన దగుల్బాజీలు
నన్ను బడి ముఖం చూడకుండా అడ్డుకున్న
దొరలపెద్ధరికాలు
అందుకే వీరందరిపై
ప్రత్యక్ష కార్యాచరణ రూపొందించి
యుద్ధానికి సిద్ధమౌతున్నాను
మరణం తప్పని నేను
రేపు కొన్ని జ్ఞాపకాలు
ఈ భూతలాన పదిలపరచాలికదా!?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి