9 వ సర్గ : - ఎడ్ల లక్ష్మి
ఎట్టి వైరభావము లేకుండ రాక్షసులను చంపబూనుట ఎంతవరకు యుక్తము? 
అని సీతాదేవి శ్రీరామునకు విన్నవించుట. 




సీతాదేవి శ్రీరామునితో ప్రేమగా ఇట్లు అనెను 
ఆర్య పుత్రా! ఏమో నీ ధర్మము సూక్ష్మమైనది 
అది తెలుసుకొనుట మిక్కిలి కష్టము
ఏ వైరము లేకుండా చంపుట పాపము 

ఓ రాజకుమారా! నీవు ధర్మాత్ముడవు 
ఏకపత్నివ్రతుడవు సత్యవంతుడవు 
ఓ సత్యవచనా! మహాత్మా! సకలేశ్వరసంపన్నా!
ధర్మము నీ చెంతనే యుండెను.

ఓ మహాప్రభూ! నీవు జితేంద్రేయుడవు 
వైరాగ్యాదిసకలసద్గుణములకు పెన్నిధివి
సమస్త ధర్మములను నిర్వహించుట 
జితేంద్రేయులకు మాత్రమే సాధ్యము.

వైరాభావము లేకున్నా గాని మానవులు 
ఇతర ప్రాణులను హింసించుచుందురు
ఆ పరిస్థితి నీకు ఇప్పుడు ఎదురైనది 
ఏ వైరము లేని రాక్షసులను వధించుటేలా

దండకారణ్యంలో నివసించుచుండెడి 
మహర్షులను రక్షించుటకై రాక్షసులను వధించెదనని 
నీవు ఆ మహర్షితో ప్రతిజ్ఞ చేసితివి 
నీ హితము కోరే నా మనస్సు బాధగా ఉంది. 

కామెంట్‌లు