కరాచీలో గణేష్ మందిరం- యామిజాల జగదీశ్

 

 వినాయక చతుర్థి దగ్గరపడుతున్న వేళ, కరాచీ నుంచి ఒక భావోద్వేగ వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పాకిస్తాన్‌లో ఉండే ఒక మరాఠీ కుటుంబం కోసం ఒక ముస్లిం కళాకారుడు వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసి రంగులు వేస్తూ అందంగా తీర్చిదిద్దడం ఇందులో కనిపిస్తుంది. అమర్ ప్రకాష్ సామాజిక మాధ్యమంలో పంచుకున్న ఈ వీడియో, మత సరిహద్దులను దాటి కళ, విశ్వాసం మనుషులను ఎలా ఏకం చేయగలవో చెప్పడానికి ఒక చక్కటి నిదర్శనం.
పాకిస్తాన్‌లోని కరాచీలో గణేష్ మఠం మందిరం ఉంది. ఈ మందిరం లోపలే సదరు ముస్లిం కళాకారుడు గణేశుడి విగ్రహానికి రంగులద్దారు
వైరల్ అయిన ఈ వీడియో క్లిప్‌లో "కౌన్ హిందూ, కౌన్ ముస్లిం?" అనే వచనం ఉంది...ఇది మతపరమైన సరిహద్దులకు అతీతంగా కళ... మానవత్వం, మత సామరస్యాన్ని చాటిచెబుతుంది. మీడియా సంస్థలు వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఈ క్షణాన్ని విస్తృతంగా ప్రశంసించారు. 

కామెంట్‌లు