కష్టమైనా మానొద్దు
చిన్ని విషయాలకే బోలెడు
సంతోషపడ్డం వదలొద్దు
చిన్ని చిన్ని మంచిపనులు
చేసి ఆనందం పొందే అలవాటు
ఆపొద్దు
ఏ పరిస్థితిలోనైనా
నవ్వేసి సాగిపోవడం
మరవొద్దు
ప్రతి క్షణం అపురూపమని
అందంగా మలచుకోడం
మన చేతిలో పని!
లెక్కలేనంత సంతోషం పంచే
ప్రోత్సాహంగా ఒక్క మాట
వల్ల నష్టం ఏమీ రాదు
మనసు గదిని అద్దంలా
ఉంచుకుంటే మంచి మాత్రమే
కనిపిస్తుంది
గెలవనిస్తే వచ్చే గెలుపులోని
ఆనందం రెండింతలు
మాట వల్ల చేత వల్ల నొప్పిస్తే
వచ్చే ఆనందం అమానుషం
అందుకోడం ఆపేసి
ఆదుకోడం మొదలెడితే
ప్రకృతిలా మనమూ
అందంగా అనిపిస్తాము
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి