ఈ చిన్నవాడిని ఏదీ ఆపలేదు.: - జగదీశ్ యామిజాల


 ​ఫ్లింట్‌షైర్‌లోని హోలీవెల్‌కు చెందిన ఆల్బీ-జూనియర్ థామస్, కేవలం పదిహేను నెలల వయసులోనే శస్త్రచికిత్స ద్వారా తన ఎడమ కాలిని కోల్పోయాడు. కానీ, పెద్ద సవాళ్లను ఎదుర్కోవడానికి అది ఎప్పటికీ అడ్డుకాదని ఏళ్లుగా నిరూపిస్తున్నాడు.
​తన తండ్రి డేనియల్‌తో కలిసి, వేల్స్‌లోని యర్ వైడ్ఫా, స్కాట్లాండ్‌లోని బెన్ నెవిస్, ఇంగ్లండ్‌లోని స్కాఫెల్ పైక్ అనే మూడు శిఖరాలను ఎక్కి, నిర్ణీత ఇరవై నాలుగు గంటల సమయలోపు రికార్డు సృష్టించాడు.
​ఈ సాహసం కోసం తండ్రి కొడుకు నాల్గు నెలలు శిక్షణ తీసుకున్నారు. ప్రయాణంలో ఆల్బీ-జూనియర్ హామ్ చీజ్ శాండ్‌విచ్‌లు, పుల్లని మిఠాయి లు, విరివిగా ద్రవ పదార్థాలు తీసుకు న్నాడు. అలాగే, కుటుంబాన్ని తలచు కుంటూ నిరంతరం ఉత్సాహంగా సాగాడు.
​ఈ ప్రయత్నం ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. అయినప్పటికీ, ఈ సాహసం ద్వారా స్థానిక ఫుట్‌బాల్ క్లబ్ హోలీవెల్ టౌన్ ఎఫ్‌సి కోసం మూడు వేల పౌండ్లకు పైగా నిధులు సేకరించారు.
​ఇప్పటికే ఇన్ని ఘనతలు సాధించిన ఆల్బీ-జూనియర్, తదుపరి ఏడాది ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. 
​అతని శరీరం ఒక సవాలు ఎదుర్కొని ఉండవచ్చు; కానీ అతని మనోధైర్యా నికి ఎల్లలు లేవు. 
కామెంట్‌లు