పిల్లల మనసులు :- వరలక్ష్మి యనమండ్ర


పిల్లల మనసులు మల్లెలవి
మకరందము వోలె తియ్యనివి 
కల్లాకపటం యెరుగనివి 
కలిసి మెలసి మెలగునవి 
//పిల్లల//

చరణం..1

పువ్వుల వోలె సున్నితము 
మంచితనానికి పరిమితము 
నిరతము చిందును మధురసము 
వానికి హద్దు ఆకసము
//పిల్లల//

చరణం..2

స్వచ్ఛమైనది ఆ డెందం 
నిత్యం పంచును ఆనందం 
నిరతము చిందును మకరందం 
నీతో వేయును అనుబంధం 
//పిల్లల//

చరణం..3

తోటకు విరిసిన పూలందం 
భూమికి పచ్చని చేలందం 
ఇంటికి పిల్లల సిరులందం 
చిందును నిత్యం మకరందం 
//పిల్లల//

కామెంట్‌లు