స్నేహితులతో కృష్ణుడు : - యామిజాల జగదీశ్


 బృందావనంలోని పవిత్ర రమణ రేతిలో ఉదయం పూట ఎండ బంగారలా మెరుస్తోంది. చిన్న కృష్ణుడు తన ప్రాణస్నేహితులతో కలిసి మెత్తటి ఇసుకలో ఆడుకుంటూ హాయిగా దొర్లుతున్నాడు. వాళ్ల నవ్వులతో ఆ వనమంతా ఉత్సాహంతో నిండిపోయింది.
​ఇది చూసి దగ్గర్లో మేత మేస్తున్న లేగదూడలు, పక్షులు కూడా అదే ఇసుకలో దొర్లడం మొదలుపెట్టాయి. కృష్ణుడి అల్లరిలో తామూ భాగం కావాలని ఆ జీవులన్నీ ఆనందపడుతున్నాయి. కొంచెం దూరంలో ఉన్న ఆవులన్నీ ప్రేమగా ఈ చిలిపి ఆటను చూస్తున్నాయి. కదంబ చెట్లు, రంగురంగుల పూలు, సీతాకోకచిలుకలు ఆ దివ్యమైన క్షణానికి సాక్ష్యంగా నిలిచాయి.
కామెంట్‌లు