ఆంధ్రవిశ్వవిద్యాలయంలో
డెబ్బది ఐదు సంవత్సరాల క్రిందటే
భూ భౌతిక శాస్త్రంలో
బంగారు పతకం సాధించి గవర్నర్ ఉపకులపతులచే సత్కారం పొంది
అసాధారణ ప్రతిభతో పరిశోధకుడిగా ఎన్నికైన
శాస్త్రవేత్త కన్న విద్యార్థులను తీర్చిదిద్దే
కళాశాల అధ్యాపకునిగా
మొదట విద్యలకు నిలయమైన
విజయనగరం మహారాజ కళాశాలలో అధ్యాపకునిగా
తరువాత అప్పుడే వర్తకులచే ప్రారంభించబడిన
అనకాపల్లి ఏ ఎం ఏ ఎల్ కళాశాల భౌతికశాస్త్ర శాఖాధిపతిగా
ముప్పది ఐదు సంవత్సరాలు
ఎందరో విద్యార్థులను తీర్చి దిద్ది
డాక్టర్లు ఇంజనీర్లు,శాస్త్రవేత్తలు ప్రజాప్రతినిధులుగా
అన్ని రంగాలలోను
ఆంధ్రవిశ్వవిద్యాలయ డిగ్రీ భౌతిక శాస్త్ర పాఠ్యాంశాల పుస్తక సంపాదకునిగా
తెలుగు భాషలో భౌతిక శాస్త్ర సాంకేతికత పదాలను వ్రాసి
కళాశాల స్థాయిలో తెలుగు భాషా మాధ్యమాన్ని
ప్రవేశపెట్టడంలో దోహద పడి
పుస్తకం చూడకుండా అనర్గళంగా
భౌతిక శాస్త్ర పాఠాలను బోధించి
ఉత్తరాంధ్రకే గాక తెలుగునాట
ఉత్తమ భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా
ప్రభుత్వంచే పురస్కారాన్ని స్వీకరించి
చదువుతో పాటు విద్యార్థులకు సేవా తత్పరత ఉండాలని
కళాశాలలో ఎన్ సి.సి ప్రవేశపెట్టి మేజర్ గా పనిచేసి
నాలాంటి ఎందరికో మార్గదర్శకులుగా నిలిచిన
స్వర్గీయ మేజర్ అమ్ము నాగభూషణం గారు
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా
మీ కివే నేనందిస్తున్న అక్షర నివాళి...!!
..........................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి