కృత్రిమ మేధ:-వరలక్ష్మి యనమండ్ర

నీలి మబ్బులలో దాగిన ఓ చిలిపి మెరుపు...
రాగి తీగల గుండెలో జన్మించిన ఓ చరుపు...

మానవ మనసుకు చేరువలోని నిశ్శబ్ద నేస్తం...
కాగితం ముక్క లేకుండా రచించే అదృశ్యకలం...

అద్దంలో లేని నీడవోలె కనిపించే బింబం...
సున్నాలు ఒకట్లతో నేసిన సాలెగూటి బంధం...

ఆకాశమంత డేటా అరక్షణంలో ఇచ్చే కల్పతరువు...
ప్రశ్నించగానే సమాధానం ఇచ్చే  విషయ మేరువు...

ఇనుప గుండెలో నిలిపారు విషయాల ప్రాణం...
అలుపు లేని కార్మికుడు మూయని గ్రంథాలయం...

అరచేతిలో నిలిచిన జ్ఞాన జ్యోతి ఆరిపోని దీపం...
తన మేధస్సుతో మనిషే సృష్టించిన జ్ఞాన రూపం...

మెదడు లేదు ప్రాణం లేదు అయినా మరువదు కర్తవ్యం...
వాడే వారిని బట్టి ఇస్తుందని అనుకూలపు సమాచారం...

ఇది కావచ్చు వాడకాన్ని బట్టి ఔషధం లేకుంటే ఆయుధం...
చీకటి నీ చీల్చి కాంతిపుంజం వాడుకో కాస్తంత భద్రం...

మన చేతుల్లో ఆకృతి మార్చుకునే కృత్రిమపు మట్టి...
మనిషి మనసే తనకు అసలైన దిక్సూచి కాబట్టి...

ప్రాణం లేదనితలంచకు స్నేహితుడిగా భావించుకో...
చివరకు నీ తెలివి, భావజాలం మాత్రమే ఉపయోగించుకో...
కామెంట్‌లు