సవ్యసాచి : - ఆర్.ఢిలేశ్వరరావు (ఋష్యశ్రీ)- సారవకోట
 

సవ్యసాచి వలె శరములును
రెండు చేతులతో వేయగల 
సామర్థ్యం, అతనివలె తనకు
చేతులు లేకున్ననూ
చేతకాదు అనుకోకుండా
కాలుతో విల్లు పట్టి..
భుజంతో లాగి, గురిపెట్టి 
సూటిగా సంధించి,
చేధించి చూపగలిగే సమర్థురాలు,
విల్లమ్ముల విజయ నారి 
ప్రపంచ పారా ఆర్చరీలో పసిడి పట్టిన
బంగారు పతకాల
భారత భాగ్యశాలి శీతల్ దేవి..
కామెంట్‌లు