నా మాట వినరా : - వరలక్ష్మి యనమండ్ర


మన్ను తినకురా
నా మాటా వి..నా..రా...
కృష్ణ మన్నూ తినకురా //మన్ను//

చక్కగ దువ్వీ సిగను కట్టీ
నెమలి పింఛము పెట్టెదనయ్యా
//చక్కగ//
మోమున నామము దిద్దెనయ్యా
ముద్దుల కన్నా ఇటు రావయ్యా 
//మన్నూ//

ఇల్లిల్లు తిరిగెదవేల
వెన్న జున్నులు కావాలంటూ 
//ఇల్లిల్లు//
మన ఇంట్లో కొదువా ఏమి
చెప్పిన మాట వినవేల. //మన్ను//

రాలుగాయి పనులను చేసి
రవ్వ లాగా మెరయుచుందువు
 //రాలు//
గొల్లభామల జుట్లు గట్టి
గిల్లీ కజ్జాల్ పెట్టుకుందువు
 //మన్ను//

వెన్నుండలు చేసితినయ్య
నెయ్యి కమ్మగ కాచితినయ్య
//వెన్ను//
పాల బువ్వ పెట్టెదనయ్య
అల్లరి వాడా నా కన్నయ్యా 
//మన్ను//


కామెంట్‌లు