మాట..!!: -డా ప్రతాప్ కౌటిళ్యా


నీతో నీవు మాట్లాడుకుంటే ఆలోచనలు అంటారు 
మరొకరితో మాట్లాడితే మాటలు అంటారు 
ఆలోచనలు వస్తుంటాయి పోతుంటాయి మాటలు మాట్లాడితేనే వస్తాయి. 
ఆలోచనలు కలల లాంటివి 
మాటలు నటనలు కళల లాంటివి 
మాటలు రావాలంటే ఆలోచనల కన్నా ముందు మనిషి మాటలు ఉండాలి.
ఆలోచనలు నటిస్తేనే మాటలు వస్తాయి 
ఆలోచనలు అనుకరిస్తేనే మాటలు అంటాం 
ఏ భాషలో ఆలోచిస్తే ఆ మాటలు వస్తాయి 
నియమాలతో అనుకరిస్తే అనువాదం అవుతుంది.

కళ్ళు ఎలా నేరుగా చూస్తాయో 
చెవులు ఎలా నేరుగా వింటాయో 
నోరు ఎలా నేరుగా మాట్లాడుతుందో 
నేరుగా మాట్లాడడమే మాట అంటాం దాన్ని భాష అనం.
మాట తర్వాతనే భాష. 

మాట భాష కతీతం 
మాట బావుకత  కతీతం 
భావం భాషలో కాదు మాటలో ఉంటుంది 
భాష ఒక్కరిది మాట ఇద్దరిదీ 

భాషకు నియమము హద్దులు ఉంటాయి 
మాటకు బావోద్వేగాలుంటాయి హద్దులు ఉండవు.
భాషను నేర్చుకుంటాం 
మాటను పంచుకుంటాం. 

భాష అద్దం లాంటిది.
మాట పర్సెప్షన్ లాంటిది 
భాష బాడీ లాంటిది 
మాట మైండ్ లాంటిది. భాష ఒక్కరిది మాట ఇద్దరిదీ. 
================================
డా ప్రతాప్ కౌటిళ్యా.
కామెంట్‌లు