వెలిగిద్దాం..!!: -డా ప్రతాప్ కౌటిళ్యా.


సూర్యున్నేమీ  వెలిగిస్తాం 
సూర్యుడే ఒక వెలుగు 
చంద్రున్నేమీ  వెలిగిస్తాం 
చంద్రుడే  ఒక వెన్నెల.....!!

ఒక కొవ్వొత్తిని వెలిగిద్దాం 
చిమ్మ చీకటిని తొలగిద్దాం 
గుళ్లో దీపం వెలిగిద్దాం 
దయగల దేవున్నీ దర్శిద్దాం..!!

మనిషిని వెలిగిద్దాం-
బుద్ధిని వెలిగిద్దాం 
మనసును వెలిగిద్దాం -
సంతోషం వెలిగిద్దాం 

మంచిని వెలిగిద్దాం 
భారత భాగవత రామాయణాలు రచిద్దాం.!!

విజ్ఞానాన్ని జ్ఞానాన్ని వెలిగిద్దాం 
శాస్త్ర సాంకేతికతను ఆవిష్కరిద్దాం 
భాషను దేశాన్ని వెలిగిద్దాం 
ఉత్తమ నాయకత్వాన్ని ఆశిద్దాం..

సూర్యున్నేమీ వెలిగిస్తాం
సూర్యుడే ఒక వెలుగు 
చంద్రున్నేమీ  వెలిగిస్తాం 
చంద్రుడే ఒక వెన్నెల.....!!!

దీపాన్ని వెలిగిద్దాం -దేశాన్ని వెలిగిద్దాం..!!
గుండెను వెలిగిద్దాం -మైండ్ ను వెలిగిద్దాం!!!
=======================================
జ్ఞాని నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
========================================
డా ప్రతాప్ కౌటిళ్యా.
కామెంట్‌లు