మన దేశంలో బీహార్ లోని ముజ్ఫర్పూర్ లిచి పళ్ళకు ప్రసిద్ధి వేసవిలో వచ్చే ఈ లీచిపండు ఆరోగ్యానికి మంచిది. ఎక్కువ నీటి శాతం ఉండి త్వరగా అరుగుతుంది వ్యాధి నిరోధక శక్తి పెంపొందిస్తుంది. సాధారణంగా ఈ పండు వేసవికాలంలోనే ఎక్కువ లభిస్తుంది. ముజఫర్పూర్ లిచి క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని ప్రసిద్ధికెక్కింది షాహిలిచి తియ్యగా రసంతో ఉండి మంచి సుగంధంతో పరిమళిస్తుంది బీహార్ లో ఎక్కువ వేడి ఉన్న మన దేశము దీని ఉత్పాతంలో రెండో స్థానంలో ఉంది చైనా లీచిస్థానం మొదటిది ముజఫర్పూర్ చరిత్ర ప్రసిద్ధిగాంచిన నగరం ఇక్కడ కుదిరంబోస్ స్మారక చిహ్నం ఉంది లక్క గాజులకు ప్రసిద్ధి బాబా గరీబ్ నాగ మందిర్ ఉంది ఉత్తర భారత దేవ గర్ అని ముజఫర్పూర్ కు పేరువేసవిలో ఇంట్లోకి చీమలు బారు వస్తుంది ఎందుకని తింటానికి నివసించడానికి ఆ ఇంట్లో సౌకర్యాలు ఉన్నాయా లేవా అని చీమల బారు దండుగా కదులుతుంది చక్కెర దొరికితే మొదట ఒక చీమ తన ఫేరోమన్ అనే వాసనని విడిచి పెడుతుంది ఆ వాసనను గ్రహించి చాలా చీమలు గుంపులుగా బయలుదేరి ఆ వాసన వచ్చినా దిక్కున ప్రయాణం మొదలుపెడతాయి వర్షాకాలం భూమి లోపల చీమల పుట్టలో నీరు నిండితే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి అవి మన ఇళ్లల్లోకి చొరబడతాయి మండు వేసవిలో చల్లదనం కోసం ఇవి సింకు పైపు బాత్రూంలో క్యూ కడతాయి రెక్కలున్న చీమలు ఎగురుతూ బ్రీడింగ్ సీజన్ కాబట్టి కొత్త కాలనీలు కట్టడం కోసం గుంపులుగా బయలుదేరుతాయి గోడల రంధ్రాలలో నేల బొరియలలో చెక్క సామాన్లలో గూడుకట్టుకుంటాయి కొన్ని మట్టితో కాలనీలు కడతాయి వేసవి తాపానికి మన ఇంటి లోపల చల్లదనానికి వంటింట్లో పంచదార బియ్యం దగ్గర ఇవి కనపడతాయి వాటికి తేమ ఉన్న ప్రదేశం వేసవిలో కావాలినేడు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి కారణం ట్రాఫిక్ సిగ్నల్స్ ని సరిగ్గా మనం పాటించకపోవడమే!1830 _1840 లోబ్రిటిష్ రైల్వేకంపెనీలు పట్టాలపై ప్రమాదాలు జరగకుండా చేసిన ప్రయత్నం!హెన్రీ బూత్ అనే ఇంజనీర్ రైల్వేస్టేషన్ రైల్వేసిగ్నల్స్ కోసం ఎరుపు (ప్రమాదం) ఆకుపచ్చ (జాగ్రత్త)తెలుపు(సురక్షితం).
ఈతెలుపు సిగ్నల్ వల్ల ప్రమాదం జరగడంతో ఆకుపచ్చని ఎన్నుకుని పసుపుపచ్చని కూడా జాగ్రత్త ను సూచించే సిగ్నల్ గా వాడారు. 1912లో లెస్టర్ వాయర్, యు.ఎస్.లో తొలి ఎలక్ట్రిక్ ట్రాఫిక్ లైట్ ని చేస్తే,ఓ అమెరికన్ పోలీసధికారి విలియంపాట్స్ పసుపుపచ్చ లైట్ అమర్చాడు.
ఆగు అనే హెచ్చరిక కోసం ఎర్రలైట్ ఎన్నుకోటానికో కారణం ఉంది.దానికాంతి వేవ్ లెంత్620_740 నైనోమీటర్ మధ్య ఉంటుంది.త్వరగా గుర్తించగలం.ఆకుపచ్చ వేవ్ లెంత్ 500_565 నైనోమీటర్తో పగలు రాత్రి గుర్తింపగలం.
ప్రపంచంలో తొలి ట్రాఫిక్ సిగ్నల్లైట్స్ 10డిసెంబర్ 1868లో లండన్ పార్లమెంట్ బైట పెట్టారు.జాన్ పిక్ నైట్ అనే బ్రిటిష్ పౌరుడు దీన్ని డిజైన్ చేశాడు.రోడ్లపై గుర్రపుబళ్లు, పాదచారులకోసం సిగ్నల్స్ ని చేతితో నడిపేవారు ఆకాలం పోలీసులు🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి