నీవు చూపే మార్గంలో నను పయనించనీ
నిను అనుసరిస్తూ నను ముందుకు సాగనీ
నా ఎదుగుదలకు చేస్తావు త్యాగం
నా కోసమే శ్రమిస్తావు అనుదినం
నా భవిష్యత్తు కొరకే యోచిస్తావు నిత్యం
నేనే ప్రాణంగా జీవిస్తావు — ఇది నిజం
నీవు చూపే ప్రేమాభిమానాలు
నాకు వెలకట్టలేని సిరిసంపదలు
నీవు నేర్పిన నైతిక విలువలు
నాకు అమూల్యమైన మణిమాణిక్యాలు
నీవు అండగా నిలిచి ఇచ్చే ధైర్యం
నాకు కొండంత బలం నాన్నా!
నీ మాటే నాకు మార్గదర్శనం
నీ నీడే నాకు రక్షణ కవచం నాన్నా!
నీ కలలలో నా భవిష్యత్తును చూసి
నా విజయాన్నే నీ విజయంగా భావించి
నను కంటికి రెప్పలా కాపాడుతూ
నా ఉన్నతికి ప్రతి క్షణం పరితపిస్తూ
నువ్వు చూపించే అనురాగం
ఎన్ని జన్మలకైనా మరువలేనిది
నీ అడుగుజాడల్లో నడవడమే నా కోరిక
నీ ఆశయాలను నిలబెట్టడమే నా బాధ్యత
నా ప్రియాతిప్రియమైన నా నాన్నా!
==================================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి