చెరసాల చీకట్లో పుట్టిన మహా వెలుగు... కృష్ణుడు! : - - యామిజాల జగదీశ్
 

చీకటి అలుముకున్న చెరసాల నాలుగు గోడల మధ్య పుట్టి, ప్రపంచమే అతిపెద్ద మహా వెలుగుగా మారిన ఒక అద్భుతమే కృష్ణుడు.
అతని పెదవుల నుండి వెలువడిన ఒకే ఒక్క వేణుగానం చాలు... తుఫానులను సైతం శాంతపరిచే అద్భుతమైన పవిత్రమైన మధురమైన వేణునాదంలో కృష్ణుడున్నాడు. 
జీవితంలో ఎంత ఆందోళన కలిగినా, యమునా నదిలా మనసును చల్లగా ప్రశాంతంగా ఉంచుకునే మహాశక్తే కృష్ణుడి జీవిత తత్వశాస్త్రం.
కృష్ణుడు అంటే ఆకాశంలో ఎక్కడో ఉండే అందనటువంటి దైవం కాదు...
మన కష్టాల మధ్యలో కూడా భుజం తట్టి, "నేను ఉన్నాను కదా... నీతో!" అని చిరునవ్వుతో చెప్పే మన అత్యంత ప్రియమైన స్నేహితుడు. ఏ హక్కూ కోరకుండా, ఏ షరతు విధించకుండా, ఆత్మను గాఢంగా ప్రేమించగలిగే రాధ మనసే అతని మహాశక్తి.
జీవితంలో కొండలా నిలిచే  సమస్యలను కూడా, గోవర్ధన పర్వతంలా ఒక వేలి కొసన మోస్తూ, చిరునవ్వుతో ఎదుర్కోవడాన్ని నేర్పించడమే కృష్ణుడి తత్వం. 
కృష్ణ చైతన్యం అనేది ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు.
మనసులో పేరుకుపోయిన వ్యతిరేక ఆలోచనలను తొలగించి, ప్రేమతో ఆనందంతో మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేసే ఆ ఉన్నతమైన అంతర్గత ప్రశాంతతే... సాక్షాత్తు కృష్ణుడు! 
కామెంట్‌లు