మహా గురువు..!!: - సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.


తను మండి తను తరిగి 
తనను తాను తరిగిపోయి 
జగతికి వెలుగు నిచ్చే 
ఒక నక్షత్రం ఒక సూర్యుడు గురువూ..!

భూమి భూమంతా తాను పారి 
భూమి భూమంతా పచ్చని బంగారు గా మార్చి 
తన నీరు తను తాగాక 
పరులకే ఏరై చెరువై పారీ చివరికి 
సముద్రంలో కలిసే మహత్తర మార్గదర్శకుడు 
ఒక మహానది కూడా గురువే...!!

మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి 
తన ఫలం తను తినక 
పరుల కడుపు నింపీ చివరికి మట్టిలో కలిసిన
మట్టిలో మాణిక్యాలను తయారు చేసే 
చెట్టు కూడా ఒక మహా గురువు....!!!

మనిషి కన్నా ముందు 
ఆకాశంలో ఎగిరిన పక్షి 
సముద్రంలో ఈదిన చేప 
 వేగంగా పరిగెత్తిన చిరుత 
భూమిపై తొలి గురువులు...!!!

మనిషి పుట్టిన తర్వాత 
మహా పర్వతంలా మారిన
మహా గురువు బుద్ధుడు 
అతని వారసులే ఉపాధ్యాయులు....!!!
===============================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
కామెంట్‌లు