అన్ని దానాలలో కంటే అన్నదానం మిన్నయని
ఆకలితో వచ్చే అన్నార్తులే పరమేశ్వర స్వరూపులని
అతిథి దేవో భవ అనే సనాతన ధర్మాన్ని అనుసరించి
అన్నం పరబ్రహ్మ స్వరూపం అని
నిత్యాన్న దానం చేసి
ఆంధ్రుల పాలిట అన్నపూర్ణగా వినుతికెక్కిన నిత్యాన్న ధాత్రి
డొక్కా సీతమ్మ గారు
పవిత్ర గోదావరి తీరాన
లంకల గన్నవరం గ్రామపు ఆమె మెట్టినిల్లు
కాశీలోని అన్నపూర్ణ దేవాలయమే.
ఆమె అన్నదానంతో బాటు
వివాహాది అనేక కార్యక్రమాలలో
గుప్త దానాలను చేసి
మానవత్వమే మాధవత్వమని
ప్రేమతత్వమే ముముక్షత్వమని భావించిన ప్రేమైకమూర్తి..
తన బాధ్యతలను పక్కన పెట్టి
జీవితమంతా అన్నార్తుల
ఆకలి తీర్చిన త్యాగమూర్తి .
ఆనాటి కింగ్ ఎడ్వర్డ్ తన రాజ్యాభిషేకానికి
మాతృమూర్తి గా ఆహ్వానిస్తే
కీర్తి కొరకు నే రాలేనని
అన్నార్తుల సేవే ముఖ్యమని తిరస్కరించిన
మహనీయురాలు .
ఆమె గౌరవ సూచకంగా సీతమ్మగారి ఛాయాచిత్రాన్ని పెట్టుకు
కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ఎడ్వర్డ్.
నేటి ఆంధ్రప్రదేశ్ లో డొక్కా సీతమ్మ గారి పేరున నిత్యాన్నదాపథకం
ప్రవేశపెట్టడం ఆమె సేవకు ఇచ్చిన అత్యున్నత గౌరవం.
అందుకోండి ఆంధ్రుల అన్నపూర్ణమ్మ
డొక్కా సీతమ్మ గారు
మీ కివే సపర్పిస్తున్న
నా అక్షర కుసుమాలు...!!
..........................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి