ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ అని పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాల ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆర్.ఎల్.కుమారి మాట్లాడుతూ సర్వేపల్లి రచించిన భారతీయ తత్వశాస్త్రం వంటి గ్రంథాలన్నీ యావత్ ప్రపంచానికి పలు అధ్యయన అంశాలుగా నిలిచాయని అన్నారు. విద్యార్థులంతా తమకు పాఠాలు నేర్పించుచున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరికీ పాదాభివందనాలు చేసి సన్మానించారు. ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి, ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు, ఉప్పలపాటి ఆదిలక్ష్మి, వై.వి.రమణ, వెలగాడ రాము, ముల్లు సుజాత, కె.అరుణకుమారి, కర్రి రమణ, సీ.హెచ్. రాజేశ్వరరావు, పిల్లల దాలమ్మలకు శాలువా, జ్ఞాపిక, పుష్పగుచ్చం, కానుకలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ వృత్తి ఔన్నత్యాన్ని, రాధాకృష్ణన్ జీవిత చరిత్రను వక్తలంతా వివరించారు. ఉపాధ్యాయని కె.అరుణకుమారి కాగితపు పుష్పగుచ్చాలను విద్యార్థులచే తయారు చేసేలా తర్ఫీదునిచ్చారు. అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
పాలఖండ్యాం పాఠశాలలో ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి