దేవుడు
ఉపాధ్యాయుడు అతడే
వాసుదేవుడు అతడే..!!
నీరు ఆకారం మార్చుకుంటుంది
దిశా మార్చుకుంటుంది. దారి మార్చుకుంటుంది
ఎంత కష్టమైనా గమ్యం చేరుకుంటుంది.
నిగర్వి నీరు ఓర్మీ నీరు
ఒదిగి ఉంటుంది నీరు అది మీరు.
ఒక కర్మ నీరు ఒక ధర్మం నీరు
అపూర్వం నీరు అది మీరు..!!
కనిపించదు గాలి కానీ వినిపిస్తుంది
స్పృశిస్తుంది గాలి
సమస్తం ఆక్రమిస్తుంది గాలి
ప్రాణం పోస్తుంది గాలి ప్రణయం గాలి
ఎక్కుపెట్టిన బాణం గాలి
జనం వనమాలి గాలి ఆ వనమాలి మీరు..!!
హద్దులేని ఆకాశం మీరు
మెరిసే నక్షత్రం మీరు సూర్యుడు మీరు
సుగంధ పుష్పం మీరు ఆకుపచ్చని ఆకు మీరు.
వేగం మీరు కాంతి మీరు కాలం మీరు
మేఘం మీరు అమోఘం మీరు
మరణం లేని కిరణం మీరు
దేవకీదేవిల వాసుదేవుడు మీరు
పారిజాతం ఐరావతం మీ పేరు
దేవలోకం మీ ఊరు
పచ్చని ప్రపంచం మీ ఇల్లు
పుష్పక విమానం మీ మనసు.
రేపటి రారాజు మీరు చీకటికి నెల రాజు మీరు
గండు తుమ్మెద మీరు పండు వెన్నెల మీరు
పురాణాల వరం మీరు గంధర్వుల గానం మీరు
పాటల చరణం మీరు మాటల స్వరం మీరు
కోదండ రాముడు మీరు
దేవదేవుడు మీరు వాసుదేవుడు మీరు...!!
============================================
తెలంగాణ రాష్ట్ర బిజెపి కోశాధికారి సిల్వర్ జూబ్లీ మిత్రుడు శ్రీ దేవికి వాసుదేవ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు..
---------------------------------------------------------
డా ప్రతాప్ కౌటిళ్యా
విశ్రాంత అధ్యాపకులు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి