సాంఘిక పరివర్తనకు కృషి చేసిన ప్రజాకవి గురజాడ
 

తన రచనల ద్వారా ‌సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన  మహనీయుడు గురజాడ వేంకట అప్పారావు అని ప్రముఖ సాహితీవేత్త కవిరాజు అప్పలరాజు అన్నారు. స్థానిక విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన
కొత్తూరు రచయితల వేదిక 18వ నెల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి,  మాట్లాడారు. వేదిక ప్రతినిధి కలమట శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో  అభ్యుదయ కవితా పితామహుడు గురజాడ అను అంశంపై కవిరాజు అప్పలరాజు ముఖ్య వక్త ప్రసంగం చేశారు. సెప్టెంబర్ 21 వ తేదీన గురజాడ అప్పారావు జయంతిని పురస్కరించుకుని నేడు ఈ కార్యక్రమం సంతరించుకుంది. ఈ సందర్భంగా అప్పలరాజు గురజాడ జీవిత చరిత్రను, తన రచనలతో సంఘ సంస్కరణకు ఏ విధంగా కృషి చేసారో వివరించారు. అనంతరం ఇటీవల ఎంపికైన వేదిక నూతన కార్యవర్గ సభ్యులు ఎనిమిది మంది ప్రమాణ స్వీకారం చేశారు. 
ముఖ్య అతిథి కవిరాజు అప్పలరాజు సమన్వయంతో నిర్వహించిన కవి సమ్మేళనంలో అందరూ గురజాడ అప్పారావు గూర్చి రచించిన కవితలను వినిపించారు. కలమట శ్రీరాములు, గడసాపు ఉషారాణి, ముదిల శంకరరావు,
అల్లిన దిలీప్ పట్నాయక్, సల్ల మన్మధరావు, ఉర్జాన ప్రసాదరావు, గేదెల అప్పలరాజులు తమ  కవితలను వినిపించారు. వాడుక భాషోద్యమానికి సామాజిక దురాచారాల నిర్మూలనకు గురజాడ కథలు కథానికలు కవితలు పద్యాలు నాటకాలు ఎంతగానో దోహదపడ్డాయని కవులంతా తమ కవితలందు వెలిబుచ్చారు. అనంతరం ముఖ్య అతిథి కవిరాజు అప్పలరాజును వేదిక సభ్యులు శాలువా జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. తొలుత సభ్యులంతా గురజాడ అప్పారావు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కామెంట్‌లు