-- రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఈర్ల సమ్మయ్య
పిల్లల్లోని అజ్ఞానమనే చీకట్లను తొలగించి విజ్ఞాన వెలుగును నింపే గొప్ప వ్యక్తి గురువని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ఊషన్నపల్లి ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. శనివారం ఆయన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులను శాలువాతో ఘనంగా సన్మానించారు. పాఠశాల పిల్లలు తాము తెచ్చిన పూలను ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు అందజేసి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఉపాధ్యాయ దినోత్సవం ప్రాముఖ్యతను గురించి వివరించారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే, గురువు వారికి అక్షరాలు నేర్పించి, ఆలోచనా శక్తిని పెంచి, అద్భుతంగా తయారు చేస్తున్నారని, సమాజంలో గురువుకు ప్రత్యేక స్థానముందన్నారు. గురువును గౌరవించని సమాజం బాగుపడదని, కొందరు కావాలని గురువులను వివిధ అక్రమ కేసుల్లో ఇరికించి, బద్నామ్ చేస్తున్నారని ఆయన అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, మంద శ్రీవాణి, ఎడ్ల స్రవంతి బండారి సరిత, పిల్లలు, పలువురు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి