మంబాపూర్ విద్యార్థులకు అంకిత ఫౌండేషన్ చేయూత
“ఎదగడానికి సమాజం కావాలి… ఎదిగిన తర్వాత సమాజానికి మీరు కావాలి” అనే స్ఫూర్తిదాయక సందేశంతో అంకిత ఫౌండేషన్ మంబాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు చేయూత అందించింది.
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 64 మంది విద్యార్థులకు పాదరక్షలు, స్కూల్ బ్యాగులు, మ్యాట్లు అంకిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించడం, వారి అవసరాలకు అండగా నిలవడం అభినందనీయమన్నారు. సమాజం నుంచి పొందిన సహాయాన్ని భవిష్యత్తులో సమాజానికి తిరిగి అందించే స్థాయికి విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో DLPO రతన్ సింగ్, గ్రామ సర్పంచ్ యాలటి భార్గవి శ్రీనివాస్, సోషల్ వర్కర్ కె.వి.యం. వెంకట్, అంకిత ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ ప్రకాష్, పాఠశాల హెచ్ఎం వీరప్ప, మాజీ ఎంపీటీసీ యాలటి శ్రీనివాస్, ఉపసర్పంచ్ మోహిద్ పాటు పంచాయతీ కార్యదర్శి
బలరాం ఉపాధ్యాయులు భాగ్యలక్ష్మి, రాధిక, బాలమణి, మొగులమ్మ, భారతమ్మ, నర్సింలు గౌడ్, శేఖర్ తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
“విద్యార్థుల భవిష్యత్తుకు చేసే ప్రతి చిన్న సహాయం… సమాజ భవిష్యత్తుకు చేసే పెద్ద పెట్టుబడి” అని నిర్వాహకులు పేర్కొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి