సామెత-355 ఇష్టమైన వస్తువు ఇంగువతో సమానం
***
"ఒరేయ్ బుడ్డోడా! నిన్నటి సంది శెప్తనే వున్న ఇన్నావ్ రా! అక్క సూడు శెప్పినట్టు యిన్నది.మంచిగున్నది. పెద్దోళ్ళు శెప్పిన మాట యినాలె. ఇంట్లె నా మాట యింటల్లేవు.బల్లె మీ సార్లు,పంతులమ్మలు శెప్పిన మాటన్న యింటున్నవా? గక్కడ సుత గిట్లనే తోక జాడిత్తున్నవా? "
"అవ్వా! పాపం గాన్ని ఏమనబాకు.గానికస్లే పొట్ట నొత్తుందని పొద్దుగాల్నించి ఒక్కటే ఏడుత్తుండు."
"భూలచ్మీ! బుడ్డోడంటే బగ్గనే పేముంది గని గానికి గట్ల పొట్ట నొచ్చే దనుక ఎందుకు సూశినవ్ శెప్పు."
"అవ్వా! నేను శెప్తనే వున్న.మయ్యగని వొద్దురా అని.గాడు అస్సలు యిన్లే.పైంగ నా యిట్టం నువ్వు శెప్పేదేందని నా మీద గుర్కాయిచ్చిండు!"
"అగ్గో! మరి సూశినవా! నేను శెప్పిన మాట యిన్లే.నువ్వు శెప్తేనేమో గుర్కాయిచ్చిండు.గిప్పుడెవలు కడ్పుల నొప్పని గిలగిల్లాడేది శెప్పు."
"అవునవ్వా! గానికి యిట్టమైనవన్కుంట వొద్దన్నా పొట్ట పగల తిన్నడు.గిప్పుడు నొప్పి లేత్తుందని ఏడుత్తుండు.తమ్ముడు ఏడుత్తుంటే నాకు సుత ఏడుపొత్తుందవ్వా!"
"వొత్తది వొత్తది! నాకు సుత గాని బాద సూత్తుంటే ఏడ్పొత్తనే వుంది. గా అప్పలు, ములుగులు,సకినాలు ఎవలి కోస్రం సేశిన శెప్పు. మీరు బల్లెకు బోయొచ్చి యిట్టంగ దినాం గిన్ని గిన్ని తింటాన్కే గద కట్టెల పొయ్యి బెట్టి రొండు దినాలు మీ యమ్మ నేను కల్శి సేశి డబ్బలకెత్తింది.అన్నం గిన్నం తినకుండ గందుల్లనే మూతి వెడ్తాడు? గిప్పుడు పొట్టల శిట్టెం గట్టి రొండుకు బోడాయె.పొట్ట గట్టిగై నొప్పి రాబట్టే."
"అవునవ్వా! ఎంతొద్దన్నా యిన్లే. గట్ల ఎక్వెక్కువ తినొద్దు గదవ్వ!పాపం గాన్కి నొప్పి ఎట్ల తగ్గుద్దో ఏమో?"
ఇగ్గో! భూలచ్మీ! ఒరేయ్ బుడ్డోడా! గిప్పన్నించైన శెప్పింది యినుండ్రి. "ఇట్టమైనది ఇంగువతో సమానం" అంటరు.అంటెందో తెల్సునా యింగువ వాసన ఎట్లుంటది? దాన్ని కూరల్ల ఆవగింజంత ఏత్తెనే మస్తు వాసనొత్తది. గట్ల మనకి ఎంత యిట్టమైనదైనా ఇంగువతో సమానమని గింతే తినాలె గని ఆబూతి గొన్నోడి లెక్క ఎక్వెక్కువ తింటే గిట్లనే అయితది.గందుకే ఎవ్వల్నీ అతి శెయ్యొద్దు అంటుంటరు.
"అస్లు ఇంగ్వతో సమానమని ఎందుకు శెప్పాలె అవ్వా! ఉప్పుతోనో , పప్పుతోనో అని శెప్పొచ్చుగా?"
బలే తెల్వుందే భూలచ్మీ నీకు! మంచిగ అడ్గినవ్. ఇంగ్వతో సమానమని ఎందుకంటరో శెప్పనా? ఉప్పు కరిగి పోద్ది. పప్పు తింటే అర్గి పోద్ది. మరి ఇంగ్వ గింత ఏత్తెనే దాని వాసన అంతట అల్ముకుంటది.వొంటేదైన రుశిగుంటది. గట్ల మంచిగుంది గదాని ఎక్వ ఏత్తే గా వొంట,గా కూర తినవొశం గాదు.గింతెందుకు దాన్ని గుడ్డల కట్టి జెర్ర సేపు ఉంచి తీత్తే ఇంగ గా గుడ్డకి అంటుకున్న ఆసన ఉత్కిన సుత పోదు.
గట్ల ఏదన్న సరే మంచిగుందని,ఇట్టమని ఎక్వ తినుడు, తాగుడు శేత్తే మన బుడ్డోడికి లెక్క పొట్ట నొప్పి,పెయ్యి నొప్పి ఒకోపాలి శాన శాన అయిరాన పడేతట్టు అయితది. గందుకే ఏది అతికం శెయ్యొద్దని" ఇట్టమైనయి ఇంగ్వతో సమానమనే " శాత్రంతో పోల్శి శెప్పిర్రు.అర్తమైంది కద.
"ఓ అర్తమైంది. మంచిగుందని,రుశిగుందని ఏది అతికంగ తినకూడదు.గట్ల ఇట్టమైన వొత్తువు మీద ఆపాచ్చన పడకూడదు" గదవ్వా!"
"అవ్వా! నాకు సుత అర్థమైంది.ఇంకోపాలి ఎప్పుడు గట్ల శెయ్యను.గిప్పుడు నువ్విచ్చిన వోమ కషాయం తాగినంక పొట్ట నొప్పి జెర తగ్గిందవ్వా."
" తగ్గిపోయింది కద!మా బుడ్డోడు బంగారు కొండ.గిట్లనే మాట మీద నిలవడ్తడు.ఇంకెప్పుడు అతికం శెయ్యడు.కదరా బుడ్డోడా !"
" బుద్దిగ తలూపుతున్న బుడ్డోన్ని, పక్కనే ఉన్న భూలచ్మిని దగ్గరకు తీస్కొని ముద్దు వెట్కుంది అవ్వ."
గదండీ సంగతి! " ఇష్టమైన వస్తువు ఇంగువతో సమానం" అంటే గిదే మరి."
తిండొక్కటే కాదు ఇట్టమైనది ఏదైన సరే గవ్వీటి మీద అతిక ఆపాచ్చన పడకూడదు.ఇంగ్వ లెక్క యికటిత్తది."se

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి