బ్రిటన్ లోని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ లోని ఐష్మోలియన్ మ్యూజియం 16వశతాబ్దికి చెందిన దుర్లభమైన అపురూప కాంస్య మూర్తిని భారత్ కి తిరిగి ఇవ్వటానికి కారణం
ఉంది.దక్షిణ భారత వైష్ణవ సాధువు థిరు మంగైఆళ్వార్ విగ్రహం అది.500ఏళ్లక్రితం తమిళనాట ఆలయంనుంచి తీసుకెళ్లారు.1967లో వేలంపాట లో మ్యూజియంకి దక్కింది.తిరుమంగై ఆళ్వార్ 12వ వైష్ణవ ఆళ్వార్.ఆఖరివాడు.8వ శతాబ్దికి చెందిన భక్త కవి.ఆయన అసలుపేరు కలియన్! ఒక సైన్యంలో కమాండర్ గా పనిచేశాడు. సన్యాసిగా మారి దివ్యప్రబంథం పేరుతో తమిళభక్తి సాహిత్యంలో 6రచనలు చేశాడు.4వేల భక్తి స్తోత్రాల సంగ్రహం.శ్రీరంగం ఆలయనిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఆయన కాంస్యవిగ్రహం దాదాపు 60సెం.మీ.ఉన్న దీన్ని డా.జె.ఆర్. బెల్మాంట్ తీసుకున్నాడు.
2019లో ఫ్రెంచ్ రిసెర్చర్ దీని చిత్రాన్ని చూశాడు. ఆచిత్రంతో విగ్రహం ఉనికి తెల్సి ఆలయంలోంచి విగ్రహం తీసుకెళ్లటం జరిగింది.ఆపై మ్యూజియం ఆవిగ్రహాన్ని గూర్చి పరిశోధన ప్రారంభించింది.16డిసెంబర్ 2019 లో భారత్ తోసంప్రదింపులు జరిపింది.11ఫిబ్రవరి 2020లో ఆలయ అధికారి పోలీసురిపోర్ట్ ఇవ్వటంతో చర్చలు జరిగాక భారత్ కి అప్పగించారు.తమిళనాడు సౌందరరాజుపెరుమాళ్ ఆలయంకి చెందిన ఆమూర్తిని భారత్ కి అప్పగించటానికి 8ఏళ్లు పట్టింది.2022లో కెల్విన్ గ్రోవ్ ఆర్ట్ గ్యాలరీ మ్యూజియం గ్లాస్గో 7చారిత్రక కళాకృతులను మనకు ఇచ్చేసింది.11,14 శతాబ్దాలకి చెందిన రాతిమూర్తులు, ఓకత్తి దాని ఒర కూడా ఉన్నాయి.🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి