జయ కిశోరి తన ప్రసంగానికి ఎంత ఫీజు తీసుకుంటారు? ఆమె తన ఆదాయాన్ని దేనికోసం ఖర్చు చేస్తారో చూద్దాం.
భారతదేశంలో ఎంతో పేరున్న ఉపన్యాసకులలో జయకిశోరి ఒకరు. దేశమంతటా గుర్తింపు పొందిన ఈమెకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
ఉపన్యాసాలతోపాటు స్ఫూర్తినిచ్చే వీడియోలకు కూడా జయకిశోరి ప్రసిద్ధి చెందారు.
ఇప్పుడు ఆమె భారతదేశంలోనే కాక ప్రపంచ స్థాయిలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈమె ప్రసంగాలు వినడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారు.
జయకిశోరి అనేక టీవీ ఛానెళ్లలో తరచూ కనిపిస్తూ కథలు చెప్తారు. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లోనూ ఈమె గురించి ఎక్కువగా మాట్లాడు కుంటారు. ఈ వేదికలపై ఈమెకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అందుకే ఈమె గురించి జనం ఆసక్తి చూపిస్తారు.
జయకిశోరి తన పదో ఏట నుంచే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటు న్నారు.
కోల్‌కతాకు చెందిన జయా కిశోరి, 1995 జూలై 13న జన్మించారు. చిన్న వయసులోనే ఆధ్యాత్మిక మార్గం ఎంచుకుని భజనలు, కీర్తనలు పాడారు. పదేళ్ల వయసు నుంచే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రవచనాలు చెప్పడంలో దేశ విదేశాల్లో పేరు తెచ్చుకున్న ఈమె, 'శ్రీమద్భాగవతం' వంటి కథలను చెప్పడంలో ఆమెకంటూ ఓ ప్రత్యేక శైలి ఉంది. ఈమె కార్యక్రమాలకు లక్షలాది మంది వస్తారు. జయ కిశోరికి ఒక యూట్యూబ్ కూడా ఉంది. అందులో ఈమె ఆధ్యాత్మిక ప్రసంగాలు, ప్రవచనాల వీడియోలు ఉంటాయి. సోషల్ మీడియాలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈమె కొత్త కొత్త భజనలు, ప్రవచనాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఈమె గురించి ప్రజలు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారు. ఈ నేపథ్యంలో, ఒక ప్రవచనం జయా కిశోరి ఎంత ఫీజు తీసుకుంటారో చూద్దాం.
అందిన సమాచారం ప్రకారం, ఒక ప్రవచనానికి జయకిశోరి రూ.9.5 లక్షలు తీసుకుంటారు. అందులో సగం డబ్బులు ముందు, మిగిలిన సగం కార్యక్రమం పూర్తయ్యాక తీసుకుంటారు.
ఇప్పుడు, జయ కిశోరి తన సంపాదనను దేనికి ఉపయోగించారో చూద్దాం. ఈమె తన సంపాదనలో ఎక్కువ శాతం దానం చేస్తారు. ఇప్పటికే ఈమె 'నారాయణ్ సేవా సంస్థ'కు పెద్ద మొత్తంలో సాయం అందించారు. దివ్యాంగులకు అవసరమైన ఆర్థిక సాయం, ఉపాధి అవకాశాలు, ఆహారం, వైద్య చికిత్సలు అందిస్తూ ఈ సంస్థ సేవలు అందిస్తోంది.
ఇది మాత్రమే కాకుండా, సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా జయ కిశోరి ఆర్థిక సాయం చేస్తారు. 'బేటీ బచావో, బేటీ పఢావో' (ఆడపిల్లను కాపాడుకుందాం, ఆడపిల్లను చదివిద్దాం) వంటి కార్యక్రమాలకు, మొక్కల నాటే ప్రాజెక్టులకు ఈమె నిరంతరం తనవంతు సహాయం అందజేస్తుండటం విశేషం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి