రుక్మిణి కృష్ణుడిని పొందినా రాధకు దక్కిన గౌరవానికో ప్రత్యేకత ఉంది.
"రుక్మిణి కృష్ణుడి భార్యగా ద్వారకలో కొలువై ఉంది... అయినా కృష్ణుడి గుండెల్లో రాధ పేరు అంతలా ఎందుకు చిరస్థాయిగా నిలిచిపోయింది?
బహుశా కృష్ణుడిని పొందడానికీ, కృష్ణుడిలో లీనమైపోవడానికీ మధ్య చాలా పెద్ద తేడా ఉండడమే కారణం..."
ఒకరోజు మనసు శ్రీకృష్ణుడిని ఒక ప్రశ్న అడిగింది— "ప్రభూ! రుక్మిణి నిన్ను పొందింది, నీ భార్య అయ్యింది, నీతో పాటు ద్వారకలో ఉంది. ఆమెకు నీ తోడు, నీ మీద హక్కు, వైవాహిక గౌరవం దక్కాయి. మరి రాధకు ఏం దక్కిందని, ఇప్పటికీ నీ పేరు కంటే ముందు ఆమె పేరు 'రాధ-కృష్ణ' అని స్మరిస్తారు?"
కృష్ణుడు చిరునవ్వు చిందిందించాడు. ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధాన బంధాలను పోల్చడంలో లేదు, ప్రేమలోని లోతుల్లో దాగి ఉంది.
రుక్మిణి ప్రేమ పవిత్రమైనది. ఆమె కృష్ణుడిని తన భర్తగా అంగీకరించి, జీవితాంతం ఆయనకు అంకితమైంది. కానీ రాధ ప్రేమకు ఎలాంటి హక్కులు అవసరం లేదు.
రాధ కృష్ణుడితో ఎప్పుడూ ఇలా అనలేదు— "నువ్వు నా వాడివి." ఆమె ప్రేమ ఎప్పుడూ ఇలాగే చెబుతుంది- "నేను నీ దానిని."
ఇదే తేడా ప్రేమను ఒక సాధారణ బంధం స్థాయి నుంచి భక్తి స్థాయికి తీసుకెళ్తుంది. రుక్మిణి కృష్ణుడి సాన్నిత్యాన్ని పొందింది, రాధ కృష్ణుడి ని తన ఉనికిలోనే నిలుపుకుంది.
రుక్మిణి కృష్ణుడితో పాటు ద్వారకలో ఉంటే, రాధ కృష్ణుడితో తన భావాల్లో జీవించింది.
రుక్మిణి ప్రేమలో దాంపత్య మర్యాద, అంకితభావం, శ్రద్ధ ఉన్నాయి. రాధ ప్రేమలో విరహం, నిరీక్షణ, తపన ఉన్నాయి, తన ఉనికిని సైతం మర్చిపోయేంత గొప్ప అంకితభావం ఉంది. అందుకే రాధ ప్రేమ కేవలం ఒక ప్రేమకథగా మిగిలిపోలేదు— అది ప్రేమకు ప్రతీకగా మారింది.
అంతమాత్రాన కృష్ణుడు రుక్మిణికి తక్కువ గౌరవం ఇచ్చాడా? లేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. రాధ, రుక్మిణీలను పోల్చి ఒకరిని గొప్పగా చేసి మరొకరిని తక్కువ భక్తి చేయడం అనిపించు కోదు.
రుక్మిణి కృష్ణుడి అర్ధాంగి. ఆమె స్థానం చాలా విశిష్టమైనది. భక్తి మార్గంలో రాధ రూపం అత్యున్నతమైన ప్రేమకు, నిస్వార్థమైన అంకితభావానికి ప్రతీక.
ఒక బంధానికి హక్కు దక్కితే, మరొక ప్రేమకు అమరత్వం దక్కింది.
ఒకరు కృష్ణుడితో జీవితాన్ని పంచుకుంటే, మరొకరు కృష్ణుడి జ్ఞాపకాల్లోనే జీవితం మారిపోయింది.
బహుశా అందుకే— కృష్ణుడి పేరు చెప్పగానే రాధ గుర్తొస్తుంది, రాధ పేరు చెప్పగానే కృష్ణుడు గుర్తొస్తాడు.
ఇక్కడ ఎలాంటి పోటీ లేదు. ఇవి ప్రేమలోని రెండు రూపాలు. ప్రేమలో నిబద్ధత, అంకితభావం ఎలా ఉండాలో రుక్మిణి మనకు నేర్పుతుంది. ప్రేమలో తనను తాను మర్చిపోయి, ఇష్టమైన వారి సంతోషంలోనే తన సంతోషాన్ని ఎలా వెతుక్కోవాలో రాధ మనకు నేర్పుతుంది.
మరి కృష్ణుడు? కృష్ణుడు బహుశా మనతో ఇదే చెప్పాలనుకుంటున్నాడు— "ఏ ప్రేమలో అయితే 'నేను' తగ్గిపోయి, 'నువ్వు' పెరుగుతుందో, ఆ ప్రేమ మెల్లగా భక్తిగా మారుతుంది."
అందుకే రాధకు ఆ గౌరవం ఆమె కృష్ణుడిని పొందినందుకు దక్కలేదు. కృష్ణుడిని ఏమీ అడగకుండానే ఆయ నే తన సర్వస్వం అనుకున్నందుకు దక్కింది.
ప్రేమలోని అత్యున్నత దశ బహుశా ఇదేనేమో— ఇష్టమైన వారిని సొంతం చేసుకోవాలనే కోరిక కూడా సమసి పోయి, వారి ఆనందమే తన ఆనందం గా మారిపోవడం.
అందుకే రాధా-కృష్ణ అనేవి కేవలం రెండు పేర్లు కావు. అవి ప్రేమకు ప్రతిరూపాలు, అందులో— ప్రేమించే వ్యక్తి కంటే ఇష్టమైనవారే ఎక్కువ ముఖ్యం, అంకితభావమే ఎక్కువ ముఖ్యం, హక్కు కంటే నమ్మకమే ఎక్కువ.
రుక్మిణి కృష్ణుడిని తన జీవితంలో పొందింది.
రాధ కృష్ణుడిని తన గుండెల్లోనే కాదు— తన ఉనికిలోనే నిలుపుకుంది.
బహుశా అందుకే శతాబ్దాల తర్వాత కూడా ఒక భక్తుడు ప్రేమకు అత్యున్న తమైన ఉదాహరణ చెప్పాలను కున్నప్పుడు, అతని పెదవులపై అప్రయత్నంగా వచ్చే మాట— "రాధా... కృష్ణ."
ఎందుకంటే నిజమైన ప్రేమ కృష్ణుడిని పొందడంలో లేదు, కృష్ణమయం అయిపోవడంలో ఉంది.
అందుకే రాధా-కృష్ణుల ప్రేమ కేవలం ఒక కథ మాత్రమే కాకుండా, నిస్వార్థమైన ప్రేమకు, అంకితభావానికి అత్యంత అందమైన ప్రతీక.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి