బాలకృష్ణం! వందే జగద్గురుం!!: - ఎం. వి. ఉమాదేవి


కంసవైరి బాలకృష్ణా 
దేవకీ వసుదేవ తృష్ణా 
నడిరేయి నదిని దాటి 
రేపల్లె చేరే యశోదకృష్ణా?

నందనందన దివ్యకృష్ణ 
నారీ మోహన నవ్యకృష్ణ 
సుందరాకార గోపాలబాల 
యదువీర రాధా కృష్ణ!!

బృందావనిలో వంశీకృష్ణా 
యమునాతటిలో యదుకులకృష్ణా 
ఆబాల గోపాలము వేచిరే 
స్వాగతమోయి చిన్నికృష్ణా!!
కామెంట్‌లు