తెలుసుకుందాం! అచ్యుతునిరాజ్యశ్రీ
 

హర్యానాకి చెందిన సంజయ్ ఉరఫ్* సిక్స్ పాక్ పెద్దయ్య* 50వ ఏట కూడా రోజూ 25 కి.మీ.పరుగెడ్తాడు. జఠేడీ పల్లెకు చెందిన కాలాపహల్వాన్ తన ఫిట్నెస్ తో మస్తు జబర్దస్త్ గా ఉన్నాడు.దేశీ పహిల్వాన్,రన్నింగ్ తావూ, హర్యానా సల్మాన్ ఖాన్ అని పిలుస్తారంతా! కావలసినంత పాలు నెయ్యి  తాగే స్థోమత లేని అతను  ఆవనూనె తాగి  చేసేవాడు కసరత్తు.కొడుకుతో ఇప్పుడు వ్యాయామం చేస్తున్నాడు.ఎల్.పి.జి.సిలిండర్ ఎత్తుతాడు. నీళ్ల బకెట్ రోలు ఎత్తుతూ ప్రాక్టీసు ప్రారంభించాడు.తెల్లవారుజామున 3 గంటలకే లేచి 20కి.మిగిలిన.పరుగు 800 గుంజిళ్లు తీస్తూ 3_4 గంటలు ప్రాక్టీస్ చేస్తాడు.ఆలిండియా 5వరాంక్ సాధించిన  సృష్టి జయంతి దేశ్ముఖ్ యుపి ఎస్ సిలో  చరిత్ర లిఖించింది. 28మార్చి 1995 లో  ఈమె భోపాల్ లో పుట్టింది. 12వక్లాస్ బోర్డు పరీక్షలో 93  శాతం సాధించి కెమికల్ ఇంజనీరింగ్ లో బి.టెక్ చేసింది.తల్లి టీచర్ తండ్రి ఇంజనీర్.రోజూ 6_7 గంటలు పేపర్లు చదివేది.2018లో తొలిసారి 5వరాంక్ సాధించిన ఈమె తన బ్యాచ్ కే చెందిన  డాక్టర్ నాగార్జున బి.గౌడా ని పెళ్లాడింది.🌷
కామెంట్‌లు