విద్యార్థులు ప్రతిభను మెరుగుపరుచుకోవాలనీ, వ్యాసరచన ద్వారా ఆలోచనలు మెరుగవుతాయినీ సృజనాత్మకత వృద్ధి చెందుతుందని, విషయం విజ్ఞానం అందడంతో పాటు మేధావులుగా రాణిస్తారనీ ఈనాడు ప్రతిభా పాటిల్ పోటీల ప్రతినిధి డా.జనపాల శంకరయ్య అన్నారు.
సెప్టెంబర్ 15 న యెల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనాడు ప్రతిభా పాటవ పోటీల్లో భాగంగా " సమాజంపై ఎల్ నినో ప్రభావం - మార్గదర్శకాలు" అను అంశంపై వ్యాసం రచనపోటి నిర్వహించగా 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వ్యాస రచనపోటిల్లో ముద్రకోల అంజలి ఎం.పి.సి ద్వితీయ సంవత్సరం ప్రథమ బహుమతి సాధించగా, ఎం.డి అఫ్సాన పర్విన్ సి.ఇ.సి ద్వితీయ సంవత్సరం రెండవ బహుమతి సాధించగా, ఇ. అస్మిత బై.పి.సి ప్రథమ సంవత్సరం తృతీయ బహుమతి సాధించగా వీరికి ప్రశంసాపత్రాలతోపాటు బహుమతులు అందజేశారు.
ప్రిన్సిపాల్ ఎస్ పద్మావతి గారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక అన్ని రంగాలలో రాణించాలని తగిన ప్రోత్సాహం అందిస్తామన్నారు.
జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ ఈనాడు సంస్థవారు విద్యార్థులు ప్రతిభను వెలికి తీయడానికి చక్కటి కార్యక్రమాలతో ముందుకు వెళ్లుతుందనీ, ఈనాడు రాజన్న సిరిసిల్ల ప్రతినిది డా.జనపాల శంకరయ్య గారు లంబాడీల జీవితం సాహిత్యంపై పరిశోధన చేసారని, రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ సలహాదారులననీ జిల్లా రచయితల సంఘం మొదటి అధ్యక్షులనీ , విద్యార్థులు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని, ఉన్నతంగా రాణించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎస్ పద్మావతి, డాక్టర్ జనపాల శంకరయ్య, ఎన్.ఎస్. ఎస్ ప్రోగ్రాం అధికారి వాసరవేణి పర్శరాములు, అధ్యాపకులు క్యాతం సత్యనారాయణ, మాదాసు చంద్రమౌళి, చెరుకు భూమక్క, బుట్ట కవిత, నీరటి విష్ణు ప్రసాద్, జ్యాతోతు శ్రీనివాస్, గజ్జెల గంగాధర్, అనుముల రవిచంద్ర, వెల్దండి సౌమ్య, అగోలం గౌతమీ, బోధనేతర సిబ్బంది విమల్ కుమార్, కనిమేని దేవేందర్, షాహినా సుల్తానా, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి