కంది పప్పు కళావతి: -- డా. కందేపి రాణీప్రసాద్
 

హలో పిల్లలు! ఈ రోజు కందిపప్పుతో అమ్మాయిని చేస్తున్నాం. కందిపప్పు పసుపు పచ్చగా అందంగా ఉంటుంది. ప్రతిరోజూ పప్పు లేనిది పిల్లలూ మీరు అన్నం తినరు కదా! మీరు ఇష్టంగా తినే పప్పన్నం తోటే ఈ అమ్మాయిని చేద్దాం.  కందిపప్పును రెండుబద్దలుగా విడదీయక ముందు కందులుగా పిలుస్తారు. ఇవి కూడా కాయలలోనే ఉంటాయి. ఇవి ‘ ఫాబేసి’ కుటుంబానికి చెందిన మొక్కలు. వీటిని ప్రధాన పంటగా బియ్యం తరువాత కందుల్నే పండిస్తారు. భారతదేశంలో బియ్యం, గోధుమలతో పాటు కలిపి తినే ప్రధాన ఆహారం. దీని శాస్త్రీయ నామం ‘‘ కజానస్ కజాన్’’. సుమారుగా 3500 సంవత్సరాల క్రితమే వీటిని భారత ఉపఖండంలో పెంచడం మొదలు పెట్టారు. భారతదేశం నుండి తూర్పు ఆఫ్రికా, పశ్చిమ ఆఫ్రికాలకు పయనం సాగించింది.యూరోపియన్లు కందులకు  ‘‘ కాంగోపి’’ అనే పేరు పెట్టారు. ప్రపంచం మొత్తం మీద చేసే కంది సాగులో భారతదేశం 63%ను పండిస్తుంది.కంది ఉత్పత్తికి ఆఫ్రికా  ద్వితీయ కేంద్రంగా పేరు పడింది. టాంజానియా, కెన్యా, ఉగాండా, మొజాంబిక్ దేశాలు ఆఫ్రికాలో ప్రధాన ఉత్పత్తిదారులు. దీనిని కన్నడంలో ‘‘ లోగరి బెలె’’ అనీ, కేరళల ‘‘ తువర పరిప్ప’’ అనీ, హిందీలో ‘‘తూర్ దాల్’’ అనీ పిలుస్తారు. ఇథియోఫియోలో కందిపప్పను మాత్రమే కాకుండా లేత రెమ్మలు, ఆకులు కూడా ఉడికించి తింటారు.
ఒక డ్రాయింగ్ షీటు మీద ఈ కళావతి బొమ్మను వేసుకున్నాను. ఈ అమ్మాయి జుట్టు విర బోసుకునే ఉన్నది.  ఈ జుట్టును వాముతో నింపాను. బాగా ఘాటైన వాసన వస్తున్నది.  పొడుగు గాగ్రా వేశాను. దీనినంతా కందిపప్పుతో కుట్టాను.  కందిపప్పు గౌను వేసుకున్నది.  గాగ్రాకు డిజైన్‌గా మిరియాలు పెట్టాను. ఈ గాగ్రా స్లీవ్ లెస్ కుట్టాను. బాగుందా మా అమ్మాయి.
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
👌