ఒక ప్రాంతాన్ని జయించిన రాజు ఏడవటం మనకు వింతగా అనిపించవచ్చు కానీ చరిత్ర లో నిదర్శనంగా చోళ చక్రవర్తి అలా కన్నీరు కార్చాడు. క్రీ.శ.993లో శ్రీలంక ప్రాచీన రాజధాని అనూరాధ పురంని జయించిన రాజరాజచోళుడు ఒంటరిగా ఆరాత్రి అక్కడున్న ఆలయాలను చూసి వెక్కివెక్కి ఏడ్చాడు.సింహళరాజు 5వ మహింద ఓడిపోయి పట్టణంవిడిచి పారిపోయాడు.రాజరాజచోళుడు వెంటనే ఆప్రాంతంపేరుని*ఇలమండలం*గా మార్చాడు. పొలొన్నారువాని రాజధానిగా ప్రకటించాడు.అనురాధపురంలోని బౌద్ధ ఆరామాలు ఆలయాలు చూసి చలించిపోయి భోరున విలపించాడు. తన సైన్యం కొన్ని ప్రాంతాల్ని తగలబెట్టింది.ఆలయాల నగనట్రాని లూటీచేశారు.చోళసైన్యం విజయగర్వంతో పిచ్చెక్కినవారిలా విగ్రహాలని కూలగొట్టినాశనంచేసింది. బౌద్ధ భిక్షువుల్ని నరికిపోగులుపెట్టింది. రాజు మనసు కకావికలమైంది. ఒంటరిగా ఓచిన్న శివాలయంలోకెళ్లి ఆరాత్రంతా పశ్చాత్తాపంతో కుళ్లికుళ్లి ఏడ్చాడు.ధార్మిక సంస్థలనాశనంకి అతనిమనసు పశ్చాత్తాపంతో కృంగిపోయింది.
చరిత్ర కారుడు కె.ఎ.నీలకంఠశాస్త్రి తన గ్రంథంThe Cholas1955లో ఈవిషయంనిగూర్చి రాశారు.తంజావూరు బృహదీశ్వర ఆలయం శిలాఫలకాలపై శ్రీలంక పై చోళదండయాత్రల వర్ణన ఉంది.తమిళగ్రంథం కలింగత్తుపరణిలో శ్రీలంక చారిత్రక గ్రంథాలలో( మహావంశ,చోళవంశ) లో అనూరాధపురపతనం,చోళుల ఆక్రమణ తర్వాత అక్కడ జరిగిన విధ్వంసాలవర్ణన చదివి చలించనివారుండరు.
నాశనంచేసిన బౌద్ధ మఠాలు, ధార్మిక స్థలాల్ని పునరుద్ధరించటానికి రాజరాజచోళుడు విశేష కృషిచేశాడు.దానధర్మాలు,ప్రజారక్షణ, భిక్షువులకి తగిన ఏర్పాట్లు చేసినా ఆమచ్చ అలా మిగిలిపోయింది.🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి