బాల గేయాల పోటీ ఫలితాలు: - డా.గజల్ శ్రీనివాస్, అద్యక్షులు, ఆంధ్ర సారస్వత పరిషత్తు
 


ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో నిర్వహించిన “బాల గేయాలు” రచనా పోటీ ఫలితాలను పరిషత్తు అధ్యక్షులు, ప్రముఖ గాయకులు డా. గజల్ శ్రీనివాస్ ప్రకటించారు.15 సంవత్సరాలలోపు బాలబాలికలు సులభంగా పాడుకునేలా, వారికి అర్థమయ్యే సరళమైన పదాలతో, సందేశం, ఆత్మవిశ్వాసం, ఆనందం, విజ్ఞానం, వినోదం కలిగించే గేయాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ పోటీని నిర్వహించినట్లు తెలిపారు. పోటీకి దేశ, విదేశాల నుంచి రచనలు అందాయని, న్యాయనిర్ణేతలు వాటిని పరిశీలించి ఉత్తమ రచనలను ఎంపిక చేసినట్లు  సమన్వయ కర్త శ్రీ కోరుప్రోలు మాధవరావు తెలిపారు
పోటీలో ప్రథమ బహుమతికి డాక్టర్ లక్ష్మీ పవన్, మస్కట్, ద్వితీయ బహుమతికి శ్రీ కె. రవీంద్రకుమార్, హైదరాబాద్, తృతీయ బహుమతికి డాక్టర్ శ్రీదేవి శ్రీకాంత్, బోట్స్‌వానా ఎంపికయ్యారు.
అలాగే శ్రీమతి వరలక్ష్మి యనమండ్ర, డాక్టర్ కర్నాటి లింగయ్య, శ్రీ జి.ఎల్.ఎస్. శర్మ, శ్రీ తంగి సన్యాసిరావు, శ్రీ ముప్పన ఈశ్వరరావు, శ్రీమతి జి. వేదవాణి, డాక్టర్ తోగట సురేష్ బాబు, డాక్టర్ డివిజి శంకరరావు, శ్రీ కె.వి. నారాయణరావు, శ్రీ ఆకుల రఘురామయ్యలను ప్రోత్సాహక బహుమతులకు ఎంపిక చేశారు.
పోటీలో పాల్గొన్న వారందరికీ అభినందన పత్రాలను అందజేయనున్నట్లు డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు. బాలల్లో తెలుగు భాష, సాహిత్యంపై ఆసక్తి పెంపొందించడమే ఈ పోటీ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. విజేతలకు డిసెంబర్ లో
ఒంగోలులో జరిగే  బాలల ప్రపంచ తెలుగు మహా సభలలో  బహుమతి ప్రదానం ఉంటుందని కార్యదర్శి శ్రీ రెడ్డప్ప ధవేజి
తెలిపారు
– ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్
కామెంట్‌లు