వికసిత భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతోంది.


 వికసిత భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతోంది అని  ఆదిశగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయనీ ప్రతి పౌరుడు దేశాభివృద్ధికి తమవంతుగా కృషి చేయాలని అప్పుడే  మంచి విద్య, ఆరోగ్యం, ఉపాధి , ఆదాయం,  భద్రత, సమానావకాశాలు  లభిస్తూ  ఆర్థికంగా, సామాజికంగా, సాంకేతికంగా, పర్యావరణ పరంగా  బలమైన దేశంగా భారత్ ఎదుగుతుందనీ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.  పద్మావతి గారు అన్నారు.
      తేది 17 సెప్టెంబర్ 2026న  యెల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో వికసిత భారత్  కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ప్రజాపాలన  దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు.
         తెలంగాణ  ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకొని ప్రిన్సిపాల్ ఎస్.పద్మావతి గారు మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వం కోసం ఉద్యమం చేసి ఎంతోమంది త్యాగం చేసారని, మరిచిపోవద్దనీ , తెలంగాణ అభివృద్ధిలో ముందుకు సాగుతోంది అని ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. అనంతరం కళాశాలలో చెత్త చెదారం తొలిగించారు. 
       ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎస్. పద్మావతి గారు, అధ్యాపకులు క్యాతం సత్యనారాయణ, జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి వాసరవేణి పర్శరాములు, మాదాసు చంద్రమౌళి, చెరుకు భూమక్క, బుట్ట కవిత, నీరటి విష్ణు ప్రసాద్, జ్యాతోతు శ్రీనివాస్, గజ్జెల గంగాధర్, అనుముల రవిచంద్ర, అగోలం గౌతమీ, బోధనేతర సిబ్బంది విమల్ కుమార్, కనిమేని దేవేందర్, షాహినా సుల్తానా, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు