రాయే..!!
మనకు అందుబాటులో ఉన్న గాలైనా నీరైనా వెలుతురైన ప్రాణమే..
మనిషి పుట్టుకకు ముందే పక్షి ఆకాశంలో ఎగిరింది
చేప సముద్రంలో ఈదిందీ
చెట్టు భూమిని ఆక్రమించింది.
సముద్రం పుట్టిన తర్వాతనే వాన కురిసింది నది పారింది.
ఆకాశానికి పూర్వమే మట్టి పుట్టింది నక్షత్రాలు మెరిసినాయి..
సూక్ష్మ క్రిమి సూక్ష్మ కణం మనిషి కనిపెట్టిండు.
సూర్యుడే భూమినీ చంద్రుని మనకు పరిచయం చేసిండు.
రాత్రి పగలు భూమి కష్టం. వెలుతురు వెన్నెల చంద్రుని కష్టం. భూమంటే మనిషికి ఇష్టం.
తెలివంటే ప్రేమ. ప్రేమ తెలిసినోడే ప్రతిభావంతుడు.
ధనవంతుడు అంటే ప్రేమించినోడు.
ధనాన్ని ఆశ్రయించినోడు దరిద్రుడు.
భూమిపైన ప్రతిభా కనిపిస్తుంది. ప్రేమ కనిపిస్తుంది
ధనం కనిపించదు.
దాచి పెట్టిన దాగనివాడు ప్రతిభావంతుడు
భూమికన్నా. విశ్వాన్ని ప్రేమించిన శ్రీమంతుడు వాడు.
నిటారుగా నిలబడ్డ పర్వతాలు విశాల సముద్రం
పచ్చని అడవులు ఎడారులు కాదు భూమి ఆస్తి
సమస్తం మనిషి మాత్రమే..
వేయి జన్మలెత్తిన కోట్ల సంవత్సరాలైనా తరగనీ ఆస్తి మనిషి.
మనిషిని నడిపించేది బ్రతికించేది ప్రేమ ఒక్కటే అది కనిపెట్టిన వాడు మనిషి ఒక్కడే.
==============================
డా ప్రతాప్ కౌటిళ్యా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి