నటనకే నడకనేర్పిన అక్కినేని: - ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్(పుష్యమి) -సెయింట్ లూయిస్-అమెరికా
 

సినీ వినీనీలాకాశంలో
ఆయనొక మేరుశిఖరం
జగమేమాయ బ్రతుకేమాయయని
భగ్నప్రేమికుడిగా దేవదాసులో
ఎవ్వరికోసం ఎవరున్నారు
పొండిరా పొండి అని ధర్మదాతగా
ముంద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో అని
మూగమనసులులో
మనసున మనసై బ్రతుకున బ్రతుకై అని డాక్టర్ చక్రవర్తిలో
శిలలపై శిల్పాలు చెక్కినారు అని మంచిమనసులలో
ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో అని అమరశిల్పి జక్కన్నలో
ఘనా ఘన సుందరా యని
భక్త తుకారం లో
అగాధమగు జలనిధిలోన ఆణిముత్యమున్నటులే అని వెలుగు నీడలులో
గాంధి పుట్టినదేశమా ఇది
నెహ్రూ కోరిన సంఘమా ఇది అని పవిత్రబంధం లో
ఎవరికోసం ఎవరికోసం
ఈ ప్రేమమందిరం అని ప్రేమనగర్ లో
లాహిరి లాహిరి లాహిరిలో
ఓహో జగమే ఊగేనుగా అని మాయాబజారులో
ఎదగడానికెందుకురా తొందరా ఎదరబతుకంతా
 చిందర వందర అని అందాలరాముడులో
ఎన్నో ఎన్నెన్నో తెలుగు సినిమాలలో 
తన నవరసభరిత నటనద్వారా  
ఏడు దశాబ్దాల పాటు రంజింపచేసిన అక్కినేని నాగేశ్వరరావు గారు
మీరు నటసామ్రాట్, కళాప్రపూర్ణ, పద్మభూషణ్, దాదాసాహెబ్ పాల్కే 
వంటి అత్యున్నత పురస్కాలకే వన్నెతెచ్చి,నటనకే నడక నేర్పిన  నటనాగ్రేసరులు
అందుకోండి మీకివే నా అక్షరసుమాంజలి..!!
.......................... 
కామెంట్‌లు